Site icon HashtagU Telugu

Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి

Telangana

Telangana

Telangana: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.

ఘటన జరిగి 15 రోజులు కూడా కాలేదు, ఇప్పటికే సీఎం సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రిని ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎన్ని ఎకరాలకు నష్టం వాటిల్లిందో పరిశీలించాలని ఆదేశించారు. వారు ఇంకా నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇస్తే పరిహారం చెల్లిస్తామని అన్నారు. గత పదేళ్లుగా చాలా సార్లు అతివృష్టి మరియు అనావృష్టి కారణంగా రైతులు అనేక నష్టాలను ఎదుర్కొన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ మరణ ఉచ్చులో పడేసిందని మండిపడ్డారు. రైతుల గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదని అన్నారు జూపల్లి. ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నిరవేరుస్తామని హరీష్‌రావుపై జూపల్లి మండిపడ్డారు.

గతంలో కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఒక్క రైతును పరామర్శించలేదని, ఎలాంటి పరిహారం ప్రకటించలేదని మంత్రి అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గత 10 ఏళ్లలో రాష్ట్రంలో మొత్తం 6,651 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా గత ప్రభుత్వం మౌనం వహించిందని ఎద్దేవా చేశారు జూపల్లి. అకాల వర్షాల కారణంగా ఏటా పంటలు దెబ్బతింటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిందని గుర్తు చేశారు.

Also Read: Sreeleela: ఇకపై తమిళ సినిమాలు కూడా చేస్తాను.. హీరోయిన్ శ్రీలీలా కామెంట్స్ వైరల్?

Exit mobile version