Site icon HashtagU Telugu

Jupalli Rameswar Rao: జేపీ నడ్డాతో భేటీ కానున్న మైహోం అధినేత..!!

Jupally

Jupally

బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు  సభకు తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాష్ట్రానికి చెందిన ఇరత రంగాల ప్రముఖులు కలుస్తున్నారు. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ రాత్రికి యువ హీరో నితిన్ కూడా భేటీ కానున్నారు. ఇక తాజాగా నడ్డాతో టీవీ9 యజమాని, మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఈరోజు సాయంత్రం 6:50 నిమిషాలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.

హన్మకొండలో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన శంషాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్ లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సమయంలో జేపీ నడ్డాతో జూపల్లి రామేశ్వరరావు భేటీ కానున్నారు.