Junior : చంద్ర‌బాబుపై `జూనియ‌ర్` అస్త్రం! వైసీపీ త‌ర‌హాలో బీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌!

జూనియ‌ర్ ఎన్టీఆర్(Junior NTR) ను బీఆర్ఎస్(BRS) పార్టీ రాజ‌కీయ సీన్లోకి తీసుకొస్తోంది.

  • Written By:
  • Updated On - December 23, 2022 / 05:37 PM IST

జూనియ‌ర్ ఎన్టీఆర్(Junior ) ను వ్యూహాత్మ‌కంగా బీఆర్ఎస్(BRS) పార్టీ రాజ‌కీయ సీన్లోకి తీసుకొస్తోంది. ఆయ‌న‌కు ఏపీలో రాజ్యాధికారాన్ని ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబునాయుడు పెట్టిన పార్టీ కాద‌ని అరిగిపోయిన రికార్డ్ ను వినిపిస్తోంది. ఏపీ సీఎంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ (Junior NTR)ను చేయాల‌ని బీఆర్ఎస్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ డిమాండ్ చేయ‌డం విచిత్రం. అలాగే, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలంగాణ ఆస్తుల‌ను దోచుకోవ‌డానికి చంద్ర‌బాబు మ‌ళ్లీ వ‌స్తున్నార‌ని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

జూనియ‌ర్  కు (Junior)టీడీపీని అప్ప‌గించాల‌ని..

ఖ‌మ్మం స‌భ హిట్ అయిన త‌రువాత బీఆర్ఎస్ మంత్రులు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. వాళ్ల‌లో గంగుల‌, ఎర్ర‌బెల్లి విభిన్నంగా స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఒకప్పుడు ప్ర‌ధాన అనుచ‌రులుగా చంద్ర‌బాబుకు మెలిగిన వాళ్లు ఎర్ర‌బెల్లి, గంగుల. వాళ్లిద్ద‌రూ ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వాన్ని విమ‌ర్శిస్తుంటే విచిత్రంగా ఉంది. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆనాడు ప‌డిగాపులు గాచిన లీడ‌ర్ గంగుల క‌మ‌లాక‌ర్. సుదీర్ఘ కాలం పాటు చంద్ర‌బాబును అనుస‌రించిన సీనియ‌ర్ లీడ‌ర్ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్. తెలుగుదేశం పార్టీ మీద ఈగ‌వాలినా యుద్ధానికి సిద్ధ‌మ‌య్యే ఎర్ర‌బెల్లి ఇప్పుడు చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ మీద వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ కు టీడీపీని అప్ప‌గించాల‌ని స‌రికొత్త డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

బీఆర్ఎస్, వైసీపీ సంయుక్తంగా దాడి (BRS)

ప్ర‌తి చోటా ఏదో ఒక రూపంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ను హైలెట్ చేయాల‌ని వైసీపీ వేసుకున్న ఎత్తుగ‌డ‌. అందుకే, టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని త‌రచూ జూనియ‌ర్ ను వెనుకేసుకు వ‌స్తుంటారు. కుమారుడు లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం చంద్ర‌బాబునాయుడు కుయుక్తుల‌తో జూనియ‌ర్ ను తొక్కేస్తున్నాడ‌ని వాళ్లు త‌ర‌చూ చేసే ఆరోపణ‌. త‌త్ఫ‌లితంగా జూనియ‌ర్ అభిమానుల రూపంలో వైసీపీకి ఎంతో కొంత లాభం చేకూరుతుంద‌ని వాళ్ల ఎత్తుగ‌డ‌. ఇదే ఎత్తుగ‌డ‌ను బీఆర్ఎస్ కూడా మంత్రి ఎర్ర‌బెల్లి ద్వారా ప్ర‌యోగిస్తోంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు ఇటీవ‌ల టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ క‌ట్ట‌డాన్ని చూస్తున్నాం. సేమ్ టూ సేమ్ ఏపీలో వైసీపీ కూడా ఎన్టీఆర్ ను కీర్తిస్తూ చంద్ర‌బాబును రాజ‌కీయ దొంగ మాదిరిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అంటే, తెలుగుదేశం పార్టీలోని అంత‌ర్గ‌త అంశాల‌పై బీఆర్ఎస్, వైసీపీ సంయుక్తంగా దాడి చేయ‌డానికి జూనియ‌ర్ , సీనియ‌ర్ ఎన్టీఆర్ ల‌ను అస్త్రాలు ప్ర‌యోగిస్తున్నార‌న్న‌మాట‌.

ఎన్టీఆర్ తెలంగాణ గ‌డ్డ మీద పుట్టారు

వాస్త‌వంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలంగాణ గ‌డ్డ మీద పుట్టారు. ఆయ‌న‌కు ఏపీతో ఎలాంటి సంబంధంలేదు. ఒకవేళ మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పిన‌ట్టు టీడీపీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే తెలంగాణ‌కు సీఎం కావ‌డానికి జూనియ‌ర్ అర్హుడుగా ఉంటారు. ఆ లాజిక్ ను మ‌ర‌చిన ఎర్ర‌బెల్లి ఏపీకి జూనియ‌ర్ ను ప‌రిమితం చేస్తూ అక్క‌డున్న స‌హోద‌ర పార్టీ వైసీపీకి ప‌రోక్షంగా స‌హ‌కారం అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గ‌డ్డ మీద ఆవిర్భ‌వించింది. సుదీర్ఘ కాలం పాటు ఉమ్మ‌డి రాష్ట్రానికి సేవ‌లు అందించింది. ఉమ్మ‌డి ఏపీలో ఆ పార్టీ పుట్టిన‌ప్ప‌టికీ తెలంగాణ భూభాగం మీద ఆవిర్భ‌వించింది. అంతేకాదు, జూనియ‌ర్ సినిమాల నిర్మాణం కూడా తెలంగాణ భూభాగం మీదే జ‌రుగుతోంది. ఆ కోణం నుంచి తీసుకున్న‌ప్ప‌టికీ జూనియ‌ర్ అన్ని విధాలా తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావ‌డానికి అర్హునిగా చూడాలి. కానీ, ఏపీ వ‌ర‌కు జూనియ‌ర్ ను ప‌రిమితం చేస్తూ టీడీపీ పగ్గాల‌ను జూనియ‌ర్ కు అప్ప‌గించాల‌ని ఎర్ర‌బెల్లి అన‌డం అటు జూనియ‌ర్ ప్ర‌భావం తెలంగాణ మీద లేకుండా ఇటు చంద్ర‌బాబును ఏపీలో రాజ‌కీయంగా న‌ష్ట‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అర్థం అవుతోంది.

జూనియ‌ర్ ను రాజ‌కీయ సీన్లోకి

ఇక గంగుల క‌మ‌లాక‌ర్ చంద్ర‌బాబు తెలంగాణ ఆస్తుల కోసం వ‌స్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యమా? అనే విష‌యాన్ని మంత్రి కేటీఆర్ చెప్పిన మాట‌ల‌ను గంగుల మ‌రిచిపోయారు. బీఆర్ఎస్ మాత్రం భార‌త దేశాన్ని ఉద్ధ‌రించ‌డానికి అన్ని రాష్ట్రాల‌కు వెళుతుంటే, తెలుగుదేశం మాత్రం తెలంగాణ ఆస్తులు దోచుకోవ‌డానికి వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్ప‌డం ఎక్క‌డో లాజిక్ మిస్స‌యిన‌ట్టు ఉంది. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను హ‌రీష్ వినిపిస్తున్నారు. అందుకు మూల్యం ఇప్ప‌టికే చంద్ర‌బాబు 10ఏళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండి చెల్లించారు. ఇక స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు అంశాన్ని వినిపించారు. దానిపై సాక్షాత్తు ఎన్టీఆర్ కుమారుడు బాల‌క్రిష్ణ అన్ స్టాప‌బుల్ షో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇంకా దాన్ని రాజ‌కీయం చేయాల‌ని బీఆర్ఎస్ లీడ‌ర్లు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతేకాదు, జూనియ‌ర్ ను రాజ‌కీయ సీన్లోకి లాగడం ద్వారా ఖ‌మ్మం స‌భ హిట్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్ర‌జ‌ల మూడ్ ను డైవ‌ర్ట్ చేసేలా మీడియా ముందుకు రావ‌డం జూనియ‌ర్ రూపంలో బూమ్ రాంగ్ అయ్యే అకాశం లేక‌పోలేదు.

BC Meet : టీడీపీతో బీసీల‌కు ఆత్మీయ‌బంధం! చంద్ర‌బాబు విజ‌య‌నగ‌రకేత‌నం!