ఈరోజు నుండి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ (Junior Doctors) కు సమ్మెకు పిలుపుపనిచ్చిన సంగతి తెలిసిందే. గత 3 నెలలుగా స్టైఫండ్ (stifund) ఇవ్వకపోవడంతో ఈ నెల 19 (మంగళవారం) నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు ఆహ్వానం పలికింది.
We’re now on WhatsApp. Click to Join.
సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) జూడాలతో చర్చలు జరిపారు. స్టై ఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ వచ్చేలా చూస్తామన్నారు. అలాగే హాస్టళ్లలో వసతులు కల్పిస్తామని ,కొత్త హాస్టల్స్ కూడా నిర్మిస్తామని, ప్రతి ఒక్కరు హాస్టల్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామని, వీటితోపాటు మిగతా సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక మంత్రి హామీలతో సమ్మెను జూడాల విరమిస్తున్న ప్రకటించారు.
Read Also : Salaar : హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం..