MLC Kavitha : ఎమ్మెల్సీ కవితపై జడ్జి సీరియస్

ఎమ్మెల్సీ కవిత ఫై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేసారు

Published By: HashtagU Telugu Desk
Judge Kaveri Baweja Serious

Judge Kaveri Baweja Serious

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case )లో అరెస్టైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఫై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం (Judge Kaveri Baweja Serious Warning ) కవిత పై వ్యక్తం చేసారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై ఫై జడ్జి కావేరీ..కవిత ఫై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఎలా మాట్లాడతారని ..ఇంకో సారి ఇలా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. అసలు కవిత ఏమాట్లాడిందంటే..

We’re now on WhatsApp. Click to Join.

మొదటి నుండి ఈ కేసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసారని..కనీసం కొడుకు కోసం బెయిల్ ఇవ్వమన్న ఇవ్వడం లేదని, పదే.. పదే సిబిఐ విచారణ పేరుతో అడిగిన ప్రశ్నలే అడుగుతూ..తన వద్ద లేని సమాధానాన్ని బలవంతంగా రాబట్టుకోవాలని చూస్తున్నారని వాపోతూ వస్తున్న కవిత..నేడు కోర్ట్ ఆవరణ లో కూడా మీడియా తో అదే విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయ కోణంలోనే తనను అరెస్టు చేసారని తెలిపింది. దీనిపై జడ్జ్ సీరియస్ అయ్యారు.

ఇదిలా ఉంటె మరోమారు కవిత సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.కవిత తరఫున ఆమె న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు.

Read Also : Sukanya Story: ముసలి మునితో కన్నెపిల్ల సుకన్య వివాహం

  Last Updated: 15 Apr 2024, 03:39 PM IST