తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (Judala ) రేపటి నుండి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister of Health Damodar Rajanarsimha) ఈ సమ్మెను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. సమ్మె వల్ల ఆసుపత్రుల సేవలు భాదించకుండా చూసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, జూడాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది.
Nara Lokesh : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా పనిచేయాలి
జూడాలు వేసిన ప్రధాన డిమాండ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయమే ప్రధానంగా నిలుస్తోంది. అలాగే ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం యత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మంత్రి దామోదర రాజనర్సింహ వారిని నేరుగా చర్చలకు ఆహ్వానించగా, జూడాలు మరియు కొంతమంది సీనియర్ వైద్యులు సంగారెడ్డి బయలుదేరారు.
ఈ నేపథ్యంలో త్వరితగతిన పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, సమ్మెను విరమించే అవకాశముంది. అయితే ప్రభుత్వం చర్యలపై జూడాల సమాధానం ఏంటి? చర్చల ఫలితం ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రేపటి సమ్మెను ఆపేందుకు చర్చలు విజయవంతం అయితే, ప్రజలకు ఆరోగ్యసేవలపై ఉండే ప్రభావం తప్పించుకునే అవకాశముంది.