జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypolls)ను దృష్టిలో ఉంచుకుని పార్టీని శక్తివంతంగా నిలబెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ (CM Revanth Reddy) నాయకులకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మరియు ప్రభుత్వం కలిసి పని చేయాలని, 18 నెలల పాలనను గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణించారు. బూత్ స్థాయిలోనే పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయవచ్చన్నారు.
AP Cabinet : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే !!
గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ కమిటీలు వేగంగా ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారు. పార్టీ పదవుల కోసం కాదు, బాధ్యతగా పనిచేయాలన్నారు. పనిచేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, ఇతర నామినేట్ పదవులను భర్తీ చేయాలని, కార్యకర్తలను నిరాశపరచకూడదన్నారు. రాబోయే రోజులలో డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలు వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని రేవంత్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి అనేక సవాళ్లను అధిగమించి చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. “పార్టీ పదవి చిన్నది కాదు, రేపటి భవిష్యత్తుకు వేదిక” అని అభిప్రాయపడ్డారు. 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చితే 18 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల ముందే బహిరంగ చర్చకు సవాల్ విసరాలని పిలుపునిచ్చారు.