Jubilee Hills Gang Rape Case : బెయిల్‌పై విడుద‌లైన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు మైన‌ర్ నిందితులు

హైదరాబాద్: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైన‌ర్లు బెయిల్‌పై విడుద‌లైయ్యారు.

  • Written By:
  • Updated On - July 27, 2022 / 07:28 AM IST

హైదరాబాద్: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైన‌ర్లు బెయిల్‌పై విడుద‌లైయ్యారు. ఐదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ జువైనల్ జస్టిస్ బోర్డు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు మైనర్ నిందితులను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.మే 28న, జూబ్లీహిల్స్‌లో ఉన్న పబ్‌లో పార్టీ జ‌రిగిన తర్వాత 17 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు మైనర్లు మ‌రో మేజ‌ర్ యువ‌కుడుతో సహా బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు యువకులను అరెస్టు చేసి వారి కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశాయి.

నిందితుల జాబితాలో ఎమ్మెల్యే కుమారుడిని చేర్చ‌కుండా రక్షించార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేరానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూన్ 8 న, హైదరాబాద్ పోలీసులు ఎమ్మెల్యే కొడుకుతో సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అప్పటి నుండి వారు జువైనల్ జైలులో ఉన్నారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ చంచల్‌గూడ జైలులోనే ఉన్నాడు.