Site icon HashtagU Telugu

NTR Death Anniversary : ఎన్టీఆర్‍కు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Ntr Kalyanram Ntr Ghat

Ntr Kalyanram Ntr Ghat

కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు (NTR Death Anniversary) గారి వర్ధంతి సందర్భంగా కోట్లాది మంది ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది.

Balakrishna Ntrghat

ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ తో పాటు కుటుంబ సభ్యులు , పలువురు టీడీపీ నేతలు , నందమూరి అభిమానులు, సినీ , రాజకీయ ప్ర‌ముఖులు నివాళ్ల‌ర్పించేందుకు ఘాట్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక జూ. ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చిన వేళ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు భారీగా చేరుకొని జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క ఎన్టీఆర్‌ స్వస్థల ప్రాంతమైన గుడివాడలో NTR 28వ వర్ధంతి కార్యక్రమం జరపబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి టీడీపీ పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. గుడివాడ పట్టణ శివార్లలోని మల్లాయపాలెంలో పెద్ద బహిరంగ సభను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు.

Read Also : NTR Death Anniversary : ‘‘తెలుగు ప్రజలరా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం’- బాబు