TS Jobs : తెలంగాణ ఈఆర్‌సీలో జాబ్స్.. డిగ్రీ, టెన్త్ అర్హతతోనే అవకాశం

TS Jobs : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్‌సీ) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Ts Jobs

Ts Jobs

TS Jobs : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్‌సీ) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీ చేయనున్న వాటిలో జాయింట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పోస్టు 1, డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు 10, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టు 01, క్యాషియర్ పోస్టు 01, లైబ్రేరియన్ పోస్టు 01, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు 01, క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 04, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు  02, రిసెప్షనిస్ట్ పోస్టు 01, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 5 ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

వీటిలో పలు పోస్టులకు డిగ్రీ లేదా ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. కొన్ని పోస్టులకు ఇంటర్, పదో తరగతి అర్హత సరిపోతుంది. పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 1. వయోపరిమితి  45 సంవత్సరాల ఏళ్ల లోపు ఉండాలి. పోస్టును(TS Jobs) బట్టి జీతాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం https://tserc.gov.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు. దరఖాస్తులను ఆఫ్ లైన్‌లో సమర్పించవచ్చు. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతావారు ఒక్కో దరఖాస్తుకు రూ.120 చెల్లించాలి.దరఖాస్తులను ‘‘కమిషన్ సెక్రటరి, డోర్ నంబర్ 11-4-660, 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004’’ చిరునామాకు పంపాలి.

Also Read : Suhas: రెమ్యూనరేషన్ పెంచేసిన సుహాస్.. అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?

MSMEలో జాబ్స్

హైదరాబాద్‌ ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈ(మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్)లో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో డైరెక్టర్, ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులతో పాటు అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ ఉద్యోగాలు ఉన్నాయి. అన్నీ కలిపి 12 ఖాళీలు ఉన్నాయి. వీటిలో డైరెక్టర్  పోస్టులు 03, ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులు  06, అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులు 02, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 01 ఉన్నాయి. మాస్టర్ డిగ్రీతో పాటు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయోపరిమితి  35 ఏళ్లకు మించకూడదు. మార్చి 29లోగా అప్లికేషన్లు సమర్పించాలి. https://www.nimsme.org/careers వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లు సమర్పించాలి.

  Last Updated: 09 Mar 2024, 11:50 AM IST