Amara Raja తో ఉద్యోగాల జాతర, 4500 మందికి ఉపాధి!

బ్యాట‌రీల త‌యారీలో అగ్ర‌గామి కంపెనీ అమ‌రరాజా (Amara Raja). ఆ కంపెనీ లోక‌ల్ టాలెంట్ ను ప్రోతషహిస్తూ కొన్ని వేల మందికి ఏపీలో ఉపాధి ఇస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Amara Raja

Amar Raja

బ్యాట‌రీల త‌యారీలో అగ్ర‌గామి కంపెనీ అమ‌రరాజా (Amara Raja). ఆ కంపెనీ కొన్ని వేల మందికి ఏపీలో ఉపాధి ఇస్తోంది. పైగా లోక‌ల్ టాలెంట్ ను ప్రోత్స‌హిస్తోంది. అలాంటి కంపెనీ విలువ తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ‌కు (Telangana) తీసుకొచ్చేలా చొరవ చూపారు. భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీ మేజర్‌లలో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ (ARBL) శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి గిగాఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. మొత్తం 270 ఎకరాల్లో నిర్మిస్తున్న కారిడార్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ఈరోజు శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, గల్లా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కూడా హాజరయ్యారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వీరు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ (Telangana) లో ఇది తొలి గిగా ఫ్యాక్టరీ కావడం గమనార్హం. ఇది దేశంలోని అతి పెద్ద ఫ్యాక్టరీల్లో ఒకటి కాబోతోంది.

ఈ కంపెనీ ఏర్పాటుతో దాదాపు 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధిని (Jobs) పొందే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అమర రాజా (Amara Raja) గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా మాట్లాడుతూ “ఎక్కువ మందికి మంచి అవకాశాలను అందించే సంస్థలను నిర్మించడమే అమర రాజా  ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు.

Also Read: Ram Charan IPL: ఐపీఎల్‌లోకి రామ్‌చరణ్‌ ఎంట్రీ.. వైజాగ్ వారియర్స్‌ తో బరిలోకి?

  Last Updated: 06 May 2023, 05:16 PM IST