Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం: భట్టి

Deputy CM Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సచివాలయంలోని గ్రూప్‌-2 అభ్యర్థులతో పరీక్షలపై చర్చించారు. విద్యార్థుల డిమాండ్‌ మేరకు గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా చేశారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి డిసెండర్‌లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించడన్నా పరీశీలించాలన్నారు. అంతేకాక త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని భట్టివిక్రమార్క అన్నారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఆన్ లైన్లో ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కోచింగ్ ఇచ్చేందుకు విషయ నిపుణులను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్లో పాఠాలు బోధిస్తారని స్పష్టం చేశారు.

కాగా, అభ్యర్తులకు వచ్చే సందేహాలను ఆయా కేంద్రాల్లోనే డౌట్స్‌ క్లియర్‌ చేస్తారని భట్టి తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని గుర్తు చేశారు. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని, ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని పునర్ఘాటించారు. గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని.. ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదని ఈ సందర్భంగా భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Telangana Panchayat Elections : పంచాయతీ ఎన్నికలఫై మంత్రి పొంగులేటి క్లారిటీ