Job Calendar : ఇక ఏటా టీఎస్​పీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌.. రెడీ అవుతున్న ముసాయిదా

Job Calendar : రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే వార్షిక జాబ్ క్యాలెండర్​ను అమల్లోకి తేవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) భావిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
TGPSC

TGPSC

Job Calendar : రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే వార్షిక జాబ్ క్యాలెండర్​ను అమల్లోకి తేవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) భావిస్తోంది. ఇందుకోసం టీఎస్​పీఎస్సీ ప్రామాణిక ముసాయిదాను రెడీ చేస్తోందట. త్వరలోనే దాన్ని ఆమోదం కోసం తెలంగాణ సర్కార్​కు పంపించనుందని తెలుస్తోంది. ఒకవేళ సీఎం రేవంత్ పచ్చజెండా ఊపితే.. ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించనున్నారు. గ్రూప్‌-1, 2, 3, 4తో పాటు అన్ని విభాగాల్లో నిరంతరం ఉద్యోగాల ప్రకటనలు వెలువరించడం వల్ల పరీక్షలకు ఉద్యోగార్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు సంవత్సరాలకు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌‌‌ను(Job Calendar) విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌‌ను టీఎస్‌పీఎస్సీ రెడీ చేస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన తరువాత ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలపై ముందుగానే ఫుల్ క్లారిటీ వస్తుంది.

Also Read :Imran Khan : ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా జైలుపై ఉగ్రదాడి.. ఏమైందంటే ?

జాబ్ క్యాలెండర్ రూపకల్పన చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను టీఎస్‌పీఎస్సీ తీసుకుంటోంది. సర్వీసు నిబంధనలను అప్‌డేట్‌ చేయడం, ఖాళీల గుర్తింపు, సర్కార్ నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల వంటి అంశాలను తెలుసుకుంటోంది. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వాహణ ప్రక్రియలో లోపాలు తలెత్తకుండా.. కోర్టు కేసుల్లో చిక్కకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో తొలి ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ సర్కారు అధికారంలోకి రాగానే ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ ఆశలను తప్పకుండా నెరవేర్చాలనే పట్టుదలతో ఉన్న రేవంత్ అండ్ టీమ్.. జాబ్ క్యాలెండర్‌‌ను రెడీ చేయడంపై ఫోకస్ చేస్తోంది.

Also Read :Sidhu: పంజాబ్ సీఎంపై నవజోత్‌ సింగ్‌ సిద్దూ సంచలన వ్యాఖ్యలు

  Last Updated: 08 Mar 2024, 12:45 PM IST