Site icon HashtagU Telugu

Job Aspirants Protest: అశోక్ న‌గ‌ర్‌లో నిర‌స‌న‌కు దిగిన నిరుద్యోగులు.. మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి అంటూ కేటీఆర్‌కు ట్వీట్‌!

Job Aspirants Protest

Job Aspirants Protest

Job Aspirants Protest: హైద‌రాబాద్‌లోని అశోక్‌న‌గ‌ర్‌లో మరోసారి గ్రూప్-1 అభ్యర్థులు నిర‌స‌న‌కు (Job Aspirants Protest) దిగారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్య‌ర్థులు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్య‌ర్థులు త‌మ డిమాండ్‌ను వినిపిస్తూ నిర‌స‌న‌కు దిగారు. దీంతో అశోక్ న‌గ‌ర్‌లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఒక్క‌సారి అశోక్ న‌గ‌ర్‌లోని గ్రూప్-1 అభ్య‌ర్థులు రోడ్డుపైకి వ‌చ్చి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అశోక్ న‌గ‌ర్‌లో మోహ‌రించారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఎక్స్ వేదిక‌గా కేటీఆర్‌కు పోస్ట్‌

అశోక్ న‌గ‌ర్‌లో ఆందోళ‌న‌కు దిగిన గ్రూప్-1 నిరుద్యోగులు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కేటీఆర్ సార్ మమ్మల్ని క్షమించండి. దయచేసి అశోక్ నగర్ కి రండి. మాకు మీ మద్దతు కావాలి అని TGPSC అభ్యర్థులు కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు. మాకు మీ మద్దతు కావాలని కేటీఆర్ ని కోరిన గ్రూప్-1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు వారిని గురువారం కలుస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.

ప్ర‌భుత్వంపై హ‌రీశ్ రావు ఫైర్‌

తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. విద్యార్థులు నివసించే అశోక్ నగర్ లో కరెంట్ లేకుండా చేసి, అక్రమంగా నిర్భందించడమేనా మీ ప్రజా పాలన? అని ప్ర‌శ్నించారు. ఎన్నికల సమయంలో మీ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఓట్లు అడిగిన విషయం మరిచిపోయారా? హామీలు ఇచ్చి విద్యార్థులను మభ్యపెట్టిన రోజులు గుర్తులేవా? పది నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల మీరు చూపిన కపట ప్రేమ అసలు రంగు బయట పడింది సీఎం రేవంత్ రెడ్డి.? విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న మీ దుర్మార్గ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామ‌ని ఆయ‌న రాసుకొచ్చారు.

Also Read: New Statue Of Lady Justice: కళ్లు తెరిచిన ‘లేడీ ఆఫ్ జస్టిస్’.. విగ్రహంలో భారీ మార్పులు