Site icon HashtagU Telugu

Jithender Reddy : కాంగ్రెస్ గూటికి జితేందర్ రెడ్డి..బిజెపికి భారీ దెబ్బ

Jithender Reddy Joins Congr

Jithender Reddy Joins Congr

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ తెలంగాణ లోని బిజెపి పార్టీకి భారీ దెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ రాకపోవడంతో జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి , ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈయనతో పాటు ఈయన కొడుకు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

We’re now on WhatsApp. Click to Join.

A.P జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి, మంత్రి ఉత్తమ్, ఇతరుల సమక్షంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొదటి నుండి కూడా తనకే బీజేపీ అధిష్టానం టికెట్ ఇస్తుందని జితేందర్ రెడ్డి భావించారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ తనదే.. తనకు ఎవరు పోటీ లేరు అంటూ మీడియా ముందు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే మొదటి జాబితాలో మహబూబ్ నగర్ స్థానాన్ని హోల్డ్ లో పెట్టింది. దీనికి కారణం కూడా ఇద్దరు బలమైన నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి లు బరిలో ఉండడమే. ఒకవేళ ముందుగా ప్రకటిస్తే పార్టీ చీలుతుందని భావించిన బీజేపీ హైకమాండ్ మొదటి జాబితాలో ఈ స్థానాన్ని హోల్డ్ లో పెట్టింది. రెండో జాబితాలో జితేందర్ రెడ్డికి కాకుండా డీకే అరుణకు ఎంపీ టికెట్ కేటాయిస్తూ ప్రకటన చేసేసరికి ఆయన తట్టుకోలేకపోయారు. అధిష్టానం ఫై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనించారు. దీంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ వంశీ చందర్ రెడ్డి ని ప్రకటించింది. దీంతో జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also : BRS Party: ఎమ్మెల్సీ కవిత అరెస్టు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు