లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు సంబదించిన మొదటి విడుత అభ్యర్థుల జాబితాను బిజెపి (BJP) శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 195 మంది తో కూడిన జాబితాను రిలీజ్ చేయగా..అందులో 09 మంది తెలంగాణ నేతలకు ఛాన్స్ ఇచ్చారు. అయితే, మిగిలిన స్థానాల కోసం ఆశావహులు అధిష్ఠానానికి ట్విటర్ వేదికగా విన్నవించుకుంటున్నారు. వారిలో జితేందర్ రెడ్డి (Jithender Reddy) ఒకరు. మహబూబ్ నగర్ టికెట్ (Mahabubnagar BJP Lok Sabha Ticket) ను ఆశిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాలకు ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులు తనకున్నాయని, పార్టీ తనను దీవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీటు కోసం డీకే.అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ ఉండడం తో ఈ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్ లో పెట్టింది. మరి ఫైనల్ గా ఎవరికీ ఇస్తుందనేది చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
మల్కాజిగిరి నుంచి చాలా మంది పోటీ పడగా… చివరకు ఈటల రాజేందర్ కు మొగ్గు చూపించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్ నుంచి జి. కిషన్ రెడ్డి , నిజామాబాద్ నుంచి అరవింద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవిలత, చెవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి భరత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేర్లను ప్రకటించారు. బీబీ పాటిల్‌కు బీజేపీలో చేరిన తదుపరి రోజే టికెట్ దక్కడం విశేషం. తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నేత సోయం బాపూరావు ఉన్నారు. అలాగే మహబూబాబాద్, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, వరంగల్ పెండింగ్ లో పెట్టింది. ఇక ఏపీ లో ఒక్క సీటు కూడా ప్రకటించలేదు.
Lord Venkateshwarlu is with me. My party will bless me with Mahabubnagar seat.I have full faith.@narendramodi @AmitShah @blsanthosh @JPNadda @sunilbansalbjp @kishanreddybjp @drlaxmanbjp pic.twitter.com/qTfiPkWBS2
— AP Jithender Reddy (@apjithender) March 3, 2024
Read Also : Prabhas : నీటిపై ముగ్గుతో ప్రభాస్ ఫోటో వేసిన అభిమానం చాటుకున్న యువతీ..