Site icon HashtagU Telugu

Jharkhand MLAs : హైదరాబాద్​లో జార్ఖండ్‌​ ఎమ్మెల్యేలు.. రంగంలోకి సీఎం రేవంత్.. 300 మందితో భద్రత

Jharkhand Mlas

Jharkhand Mlas

Jharkhand MLAs : భూకుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడం.. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. వెంటనే హేమంత్ సోరెన్‌ ఆప్తుడు చంపై  సోరెన్ తదుపరి సీఎంగా ప్రమాణం చేశారు. చంపై  సోరెన్ ప్రమాణ స్వీకారం తర్వాత శాసనసభ్యుల బలాన్ని నిరూపించుకునేందుకు గవర్నర్ 10 రోజులు గడువు ఇచ్చారు. దీంతో జేఎంఎం, కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ తమవైపు తిప్పుకుంటుందో అనే ఆందోళన పెరిగింది.  ఎందుకంటే మహారాష్ట్ర, బిహార్‌లలో ప్రభుత్వాలను బీజేపీ ఎలా మార్చేసిందో అందరూ చూశారు. జార్ఖండ్‌లో కూడా అదే తరహా సీన్ రిపీట్ అవుతుందనే ఆందోళనకు జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి భావించింది. అందుకే రెండు పార్టీల ఎమ్మెల్యేలను(Jharkhand MLAs) హైదరాబాద్‌కు తరలించారు.

We’re now on WhatsApp. Click to Join

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను శామీర్‌పేటలోని లియోనియో రిసార్ట్స్‌లో ఉంచారు. వీరి పర్యవేక్షణ బాధ్యతలను ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి రామిరెడ్డికి అప్పగించారు. వీరి పర్యవేక్షణ బాధ్యతలను ఎల్బీనగర్ కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రామిరెడ్డికి అప్పగించారు. మల్‌రెడ్డి అనుమతి లేనిదే ఎవ్వరినీ శిబిరంలోకి అనుమతి ఇవ్వొదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులకు ఆదేశాలిచ్చారు. మీడియాను కూడా ఆ ప్రాంతం వద్దకు అనుమతించడం లేదు. లియోనియో రిసార్ట్స్‌ వద్ద దాదాపు 300 మంది పోలీసులను మోహరించినట్లు తెలిసింది.

Also Read : Nokia – HMD : ‘నోకియా’ పోయే.. ‘హెచ్ఎండీ’ వచ్చే.. పెద్ద మార్పు!

ఈ నెల 5న బలపరీక్ష ఉండటంతో ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం కానీ హైదరాబాద్ శిబిరంలో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాంచీకి వెళ్తారు. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఝార్ఖండ్ శాసనసభలో 41 మంది సభ్యుల మెజార్టీ ఎవరికి ఉంటే వారిదే అధికారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేఎంఎం మూడింటికి కూడా తగినంత మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న జేఎంఎం పార్టీతో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  హిందీ బెల్ట్‌లోని విపక్ష పాలిత రాష్ట్రాలపై పట్టును సంపాదించడంపై బీజేపీ ప్రధాన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో, బిహార్‌లో ప్రభుత్వాలు మారిపోయాయి. ఇక జార్ఖండ్‌లో ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Also Read : Nokia – HMD : ‘నోకియా’ పోయే.. ‘హెచ్ఎండీ’ వచ్చే.. పెద్ద మార్పు!

Exit mobile version