Site icon HashtagU Telugu

MLA Sanjay Kumar : ఎమ్మెల్యే సంజయ్​ చేరిక పట్ల జీవన్​ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారా..?

Sanjaykumar

Sanjaykumar

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ (Congress) బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు ఇస్తుంది. ఎన్నికల్లో బిఆర్ఎస్ ను చిత్తూ చేసిన రేవంత్ సేన..ఇప్పుడు బిఆర్ఎస్ లో గెలిచినా కొద్దివారిని సైతం తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ..కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం కారు దిగి హస్తం గూటికీ చేరనున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ (MLA Sanjay Kumar)..కాంగ్రెస్ లో చేరిక ఫై స్థానిక ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి (MLC Jeevan Reddy) అసంతృప్తితో ఉన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవటంపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుండి జీవన్‌ రెడ్డి మద్దతుదారులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. జీవన్‌ రెడ్డిని కలిసి జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే జీవన్ ​రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం మాట్లాడుతున్నట్లు తెలిసింది. జీవన్‌ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకూ స్పందించలేదు.

We’re now on WhatsApp. Click to Join.

జగిత్యాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైద్రాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన డాక్టర్‌ సంజయ్‌ జగిత్యాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో పర్యాయం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ (కంటి శస్త్ర వైద్య నిపుణులు) విద్యను అభ్యసిం చిన సంజయ్‌ జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లో నేత్ర వైద్యుడిగా మంచిగుర్తింపు పొందారు.

పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి సుమారు 20వేల ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. తొలిసారిగా బీఆర్‌ఎస్‌లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవ ర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి 62,616 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌కు 54,788 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో పర్యాయం పోటీ చేసి విజయం సాధించారు. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌కు 70,243 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డిపై 15,822 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు.

Read Also : Parliament Session 2024: లోక్‌సభలో రాహుల్‌గాంధీ రాజీనామా ఆమోదం