Jeevan Reddy : 70 స్థానాలతో తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నాం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా

బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని , ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారికి ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కాబట్టి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 12:25 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (2023 Telangana Elections) నెల రోజుల సమయం మాత్రమే ఉండడం తో అధికార పార్టీ (BRS) తో పాటు మిగతా పార్టీలన్నీ మరింత దూకుడు పెంచాయి. ఈసారి ఎన్నికలు బిఆర్ఎస్ – కాంగ్రెస్ (BRS-Congress) పార్టీల మధ్యనే గట్టిగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు ఇరు పార్టీల గెలుపును వ్యక్తం చేసాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారని , రెండుసార్లు బిఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఓ ఛానల్ తో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో 70 స్థానాలతో అధికారం చేపట్టబోతున్నాం అని ధీమా వ్యక్తం చేసారు.సాగునీటి రంగంలో కాళేశ్వరం, తాగునీటి రంగంలో మిషన్ భగీరథ రెండు స్కీంలు విఫలం అయ్యాయన్నారు. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని , ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారికి ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కాబట్టి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటె శుక్రవారం కాంగ్రెస్ అధిష్టానము రిలీజ్ చేసిన రెండో విడత అభ్యర్థుల ప్రకటన పార్టీ లో అసమ్మతి సెగలు రేపుతోంది. పార్టీ ఆశించి భంగపడ్డ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తూ..తమ రాజకీయ భవిష్యత్ గురించి కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో కొనసాగడమా..? లేక పార్టీ రాజీనామా చేసి వేరే పార్టీ లో చేరడమా అనేదానిపై చర్చలు మొదలుపెట్టారు.

Read Also : Pawan Kalyan: వాట్ ఈజ్ దిస్ బ్రో.. బుల్లితెరపై పవన్ మూవీకి లోరేటింగ్