Anjali Murder: హైదరాబాద్ లోని జీడిమెట్లలో చోటుచేసుకున్న తల్లి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు కలిసి వారి ఇంట్లోనే తల్లిని నిందితంగా భావించి దారుణంగా హత్య చేసిన సంఘటన నగర ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. హత్యకు గురైన మహిళ అంజలి మృతదేహాన్ని గురువారం సూరారులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్‌కు తరలించి, తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా తరలించారు.
Surgical Towel : మహిళ కడుపులో సర్జికల్ టవల్ ను వదిలేసిన డాక్టర్స్
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివ తల్లి సంతోషి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. “ఈ కేసులో అసలు విషయం బాలిక వద్దే ఉంది. ఆమె నిజాలను బయటపెడితే మేము తప్పు చేయలేదన్న విషయం రుజువవుతుంది” అంటూ ఆమె మీడియాతో అన్నారు. “అంజలిని చంపడం మా తప్పు కాదు, మేము తప్పుచేయలేదు. తప్పంతా ఆ అమ్మాయిది. నాకేం టెన్షన్ లేదు. ఈరోజు కాకపోతే రేపు నా కొడుకులను జైలులోనుంచి తీసుకొస్తా. ఆమె మా ఇంటికి రావడం, మా మీద కేసులు పెట్టడం తప్పు. ఆమెను చంపడం సరైనదే” అంటూ ఆమె అనేసింది.
ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాయి. నిందితుడి తల్లి ఒక మృతిపై ఈ స్థాయి విమర్శలు చేయడం పోలీసుల దృష్టిని ఆకర్షించడంతో పాటు, సామాజికంగా కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శివ తల్లికి సంబంధించిన ఈ అభిప్రాయాలు కేసు విచారణలో మరో కోణంగా మారే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. శివ, అతని తమ్ముడు, బాధిత బాలికతో కలసి ఈ హత్యను ప్లాన్ చేశారని ఆధారాలు తేలిపోతున్నాయి. బాలికను జువెనైల్ హోంలో చేర్చగా, ఇద్దరు అన్నదమ్ములను రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల దృష్టి ప్రస్తుతం నిందితుల వెనుక ఉన్న కారణాలు, బాలిక పాత్ర, హత్యకు దారితీసిన పరిణామాలపై ఉంది. సమాజాన్ని కలచివేసిన ఈ హత్యపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. మహిళల భద్రతపై మరోసారి గంభీర చర్చలు మొదలయ్యాయి.
Dating : హార్దిక్ పాండ్యతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్