Site icon HashtagU Telugu

JEE main 2022: జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ!

JEE మెయిన్ 2022 ఫలితాలు విడులైన సంగతి తెలిసిందే. 100 శాతం సాధించిన టాపర్‌ల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 14 మంది విద్యార్థులు మంచి స్కోర్ సాధించారు. జాస్తి యశ్వంత్ వి.వి.ఎస్, రూపేష్ బియానీ, అనికేత్ చటోపాధ్యాయ, ధీరజ్ కురుకుంద విద్యార్థులు మంచి స్కోర్ సాధించారు. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు (కొయ్యన సుహాస్, పెనికలపాటి రవి కిషోర్, పోలిశెట్టి కార్తికేయ) 100 శాతం స్కోరును సాధించారు.

100 శాతం సాధించిన ఇతర రాష్ట్రాల అభ్యర్థులు

బోయ హరేన్ సాత్విక్ (కర్ణాటక)

స్నేహ పరీక్ (అస్సాం)

సార్థక్ మహేశ్వరి (హర్యానా)

కుశాగ్ర శ్రీవాస్తవ (జార్ఖండ్)

మృణాల్ గార్గ్ (పంజాబ్)

నవ్య (రాజస్థాన్)

సౌమిత్ర గార్గ్ (ఉత్తర ప్రదేశ్)

JEE (మెయిన్) – 2022 పరీక్ష రెండు సెషన్ల తర్వాత, ఇప్పటికే రూపొందించిన పాలసీకి అనుగుణంగా రెండు NTA స్కోర్‌లలో ఉత్తమమైన వాటిని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ర్యాంక్‌లు విడుదల చేయబడతాయి. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా పర్యవేక్షించేందుకు మొత్తం 558 మంది పరిశీలకులు, 424 మంది సిటీ-కోఆర్డినేటర్లు, 18 మంది ప్రాంతీయ సమన్వయకర్తలు, 369 మంది డిప్యూటీ/ఇండిపెండెంట్ అబ్జర్వర్లు, 02 మంది జాతీయ కోఆర్డినేటర్‌లను నియమించారు. పరీక్ష 13 భాషలలో (అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ) భాషల్లో జరిగాయి.