Smita Sabharwal : వాహనాల అద్దె వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌కు జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ రేపో,మాపో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. యూనివర్సిటీ నిధులను తన వాహనాల అద్దె చెల్లింపునకు వినియోగించారనే ఆరోపణలను స్మితా సభర్వాల్ ఎదుర్కొంటున్నారు. ఈ అంశం ఆడిట్‌లోనూ తేలిందని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ తెలిపారు. వాహన అద్దె కింద తీసుకున్న నిధులను తిరిగి చెల్లించాలని స్మితను ఆయన కోరారు. లేదంటే న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Also Read :Richest MLA : దేశంలోని సంపన్న ఎమ్మెల్యేల జాబితా.. ఏపీయే టాప్
అసలేం జరిగింది ?
- 2016 సంవత్సరం నుంచి 2024 మార్చి మధ్య కాలంలో దాదాపు 90 నెలల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అదనపు కార్యదర్శి హోదాలో స్మితా సభర్వాల్ వాహన అద్దెను తీసుకున్నారనే అభియోగాలు ఉన్నాయి.
- తన వాహనాల అద్దె చెల్లింపు కోసం ప్రతినెలా రూ.63 వేలు చొప్పున దాదాపు రూ.61 లక్షలను స్మిత తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- యూనివర్సిటీ నుంచి వాహనఅద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది.
- ఆడిట్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసినందునే స్మితా సభర్వాల్(Smita Sabharwal)కు నోటీసులు జారీ చేయాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకుందట.
సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటాపై..
ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ 2024 జులై 22న తన ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు? వారికి ఇతర విభాగాల్లోని టెక్నికల్, ఆర్‌అండ్‌డీ, డెస్క్ జాబ్‌లు సరిపోతాయి’’ అని ఆ పోస్టులో ఆమె ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. స్మితా సభర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, మరికొంతమంది దివ్యాంగులు ఫిర్యాదు చేశారు.