Site icon HashtagU Telugu

Janta Ka Mood Survey : మరో సర్వే కూడా బిఆర్ఎస్ పార్టీకే జై కొట్టింది

Janta Ka Mood Survey Brs

Janta Ka Mood Survey Brs

దేశం మొత్తం చూపు తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పైనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..ఈసారి విజయం సాధిస్తుందా..? లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మరోపక్క రాష్ట్రంలో పలు సంస్థలు సర్వేలు పలు పార్టీల విజయాలు ఖరారు చేస్తుండడంతో ఎవరి సర్వే కరెక్ట్ అనేదానిపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటీకే కాంగ్రెస్ (Congress) గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా..మరికొన్ని బిఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే (Mission Chanakya Survey) తో పాటు ఆత్మసాక్షి (Atmasakshi Survey ), రాజనీతి (Rajneethi Survey) సంస్థలు తెలంగాణ లో రాబోయేది బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వమే అని తేల్చి చెప్పగా..తాజాగా జనతా కా మూడ్ సర్వే (Janta Ka Mood Survey) సైతం తెలంగాణ లో రాబోయేది బిఆర్ఎస్ పార్టీనే అని తెలిపింది. బీఆర్ఎస్ కు 72 నుంచి 75 వరకు సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 వరకు గెలుచుకుంటుందని వెల్లడించింది. బీజేపీ కేవలం 9 నుంచి 7 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఎంఐఎంకు 4 నుంచి 6 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే… బీఆర్ఎస్ కు 41 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎంకు 3 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 20 వేల శాంపిళ్లను తీసుకుని ఈ సర్వే చేసినట్టు వెల్లడించింది. ఇలా వరుస సర్వేలు బిఆర్ఎస్ దే విజయం అని తేల్చి చెపుతుండడం తో బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : Annaram Saraswati Barrage : తెలంగాణలో మరో బ్యారేజీ లీకేజ్..ఏంటి కేసీఆర్ సార్ ఇది