Site icon HashtagU Telugu

Telangana Janasena : తెలంగాణ లో 32 స్థానాల్లో జనసేన పోటీ..నియోజకవర్గాల లిస్ట్ ఇదే

Jana Sena To Contest In Telangana

Jana Sena To Contest In Telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) జనసేన సైతం పోటీ చేయబోతున్నట్లు రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ను ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. జనసేన (Janasena) ప్రభావం ఎక్కువగా ఏపీలోనే ఉందని..తెలంగాణ లో పెద్దగా లేదని అంత మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ తాజాగా తెలంగాణ లో ఏకంగా 32 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు..దాని తాలూకా నియోజకవర్గాలను పార్టీ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు పార్టీ అధిష్టానం.

We’re now on WhatsApp. Click to Join.

కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనతనగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజుర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర అసెంబ్లీ స్థానాల్లో జనసేన బరిలోకి దిగుతుందని నాయకులు ప్రకటించారు. మరి నిజంగా ఈ నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతుందా..? మరి ఆ నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేస్తారా..? ఇంతకీ ఆ నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు..? అనేది చూడాలి.

Read Also :Bigg Boss 7 : నలుగురు అమ్మాయిలే ఎలిమినేట్.. ఏం జరుగుతుంది..? 

ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ vs కాంగ్రెస్ మధ్య హోరా హోరి పోరు నడుస్తుంది. మొన్నటి వరకు బిజెపి హావ కనిపించినప్పటికీ..ప్రస్తుతం బిజెపి ని వెనక్కు నెట్టి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుంది. అతి త్వరలో అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.