Site icon HashtagU Telugu

Janasena : తెలంగాణ ఎన్నికల వేళ జనసేన కు షాక్ ఇచ్చిన ఈసీ

Janasena Ts

Janasena Ts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి (BJP) తో పొత్తుపెట్టుకున్న జనసేన..8 స్థానాల్లో బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే ఈ 8 మంది నామినేషన్ దాఖలు చేసి ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం జనసేన కు భారీ షాక్ ఇచ్చింది. తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు. దీంతో జనసేన పోటీ చేసే 8 స్థానాల్లో గ్లాస్ గుర్తు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల సంఘం తేల్చనుంది. ఇది పార్టీ కి బిగ్ షాక్ అనే చెప్పాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలు చూస్తే..కోదాడ నియోజకవర్గం నుంచి మేకల సతీశ్ రెడ్డి, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి వంగా లక్ష్మణ్ గౌడ్, వైరా నుంచి సంపత్ నాయక్, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, కూకట్‌పల్లి నుంచి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి శంకర్ గౌడ్, అశ్వారావు పేట నుంచి మూగబోయిన ఉమాదేవి లు జనసేన తరుపున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరందరికి బుధువారం హైదరాబాద్ లోని జనసేన ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బి ఫారాలు (B-Form) అందజేసి అల్ ది బెస్ట్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు పవన్.

Read Also : Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై ‘సుప్రీం’ సంచలన నిర్ణయం, ఆ రాష్ట్రాలకు వార్నింగ్