MLA Muthireddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి.. కారణమిదే!

జనగామ ఎమ్మెల్యే (MLA) ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్ర వేదనకు గురయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Muthireddy

Muthireddy

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తరచుగా వివాదాల్లోకి ఎక్కుతుంటారు. ఆయనపై ఎన్నోసార్లు ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా మరోసారి ముత్తిరెడ్డి పేరు వినిపిస్తోంది. భూ వ్యవహరమై స్వయంగా ఆయన కుమార్తె  పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి (Muthireddy Yadagiri Reddy) తీవ్ర వేదనకు గురయ్యారు.

తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి.. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని ముత్తిరెడ్డి కుమార్తె భవానీ.. ఉప్పల్‌ ఠాణాలో (Police) ఇటీవల ఫిర్యాదు చేశారు. కుమార్తె ఫిర్యాదుపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన బిడ్డను రాజకీయ ప్రత్యర్ధులు వాడుకుంటున్నారని వాపోయారు. ప్రతి కుటుంబంలో (Family) సమస్యలు ఉంటాయని.. వాటిని ఇంట్లోనే తేల్చుకుంటామని చెప్పారు. చేర్యాలలో 1200 గజాల భూమి తన బిడ్డ పేరుపైనే ఉందని.. ఎటువంటి ఫోర్జరీ జరగలేదని ఎమ్మెల్యే (Emotion) కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: Tabu-Nag Dating: టబుతో డేటింగ్ రూమర్స్.. కింగ్ నాగార్జున రియాక్షన్ ఇదే

  Last Updated: 09 May 2023, 05:01 PM IST