Site icon HashtagU Telugu

Dalit Bandhu: ముత్తిరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు..కేసీఆర్ కు ఓటు వేసే వాళ్ల‌కే దళితబంధు..!!

Muthireddy

Muthireddy

జనగామ టీఆరెస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ కు ఓటు వేసినవాళ్లకే దళితబంధు ఇస్తామన్నారు. కొమురవెళ్లి మండల సమావేశంలో ముత్తిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ గ్రామస్తులకు దళితబంధు అందడం లేదని…అర్హులైన వారికి దళితబంధు ఇవ్వాలంటూ రాంసాగర్ సర్పంచ్ ఎమ్మెల్యేను కోరారు.

ముత్తిరెడ్డి సమాధానం ఇస్తూ….గతంలో ఎప్పుడూ లేనివిధంగా నీళ్లు, విద్యుత్ ఇస్తున్నామని..కేసీఆర్ కిట్, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీతోపాటుగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటు వేసినవారికే దళితబంధులో అవకాశం కల్పిస్తామన్నారు. ఇందులో ఎలాంటి దాపరికంలేదన్నారు ఎమ్మెల్యే.

దీంతో ముత్తిరెడ్డిపై వివక్షవ్యతిరేక పోరాటం సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దళిత సర్పంచ్ లను అవమానించేలా మాట్లాడారని మండిపడింది. కేసీఆర్ కు ఓటు వేస్తేనే దళిత బంధు ఇస్తాము…నువ్ నోరు మూసుకుని కూర్చో అంటూ అనుమానించిన ముత్తిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

Exit mobile version