Site icon HashtagU Telugu

Janagama BRS President Dies : జనగామ బీఆర్ఎస్ జెడ్పీ ఛైర్మన్ మృతి

Janagama Brs Zp Chairman Sa

Janagama Brs Zp Chairman Sa

బీఆర్ఎస్ (BRS) పార్టీ లో విషాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షడు (Janagama BRS President Dies), జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి (Sampath Reddy) గుండె పోటుతో మరణించారు. హన్మకొండ లోని చైతన్యపురిలో సంపత్ రెడ్డి ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా చాతిలో నొప్పి వస్తుందంటూ వ్యక్తిగత సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆయన్ను నగరంలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే అయన మృతి చెందారు. ఎమర్జెన్సీ వార్డులో చివరి ప్రయత్నంగా డాక్టర్స్ చికిత్స చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసింది. పదేళ్ల పాలన..సంక్షేమ పధకాలు ఇలా అన్ని కూడా మరోసారి విజయాన్ని అందిస్తాయని కేసీఆర్ గట్టి నమ్మకం తో ఉండగా..ప్రజలు మాత్రం మార్పు కోరారు. ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలువగా..బిఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బిజెపి 08 , MIM 07 స్థానాల్లో సిపిఐ ఒక స్థానంలో విజయం సాధించింది.

Read Also : New Convoy Vehicles For Telangana CM : తెలంగాణ కొత్త సీఎం కాన్వాయ్ సిద్ధం..తగ్గేదేలే