Janareddy : సీఎం అయితానేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన జానారెడ్డి

"కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు సాధ్యం కాదన్న కేసీఆర్... ఆ హామీలను కాపీ కొట్టి మేనిఫెస్టో లో పెట్టారు. కేసీఆర్ మాటల గారడితో రాజకీయం చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచుతోంది

Published By: HashtagU Telugu Desk
Janareddy

Janareddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) జోరు మొదలైంది. ముఖ్యముగా ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ (Congress) vs బిఆర్ఎస్ (BRS) మధ్య గట్టిగా ఉండబోతున్నాయి. పలు సర్వేలు ఈసారి కాంగ్రెస్ పార్టీదే అధికారం అని చెపుతుండడం తో అంత కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. పలు పార్టీల నేతలు సైతం ఇదే నమ్ముతూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. బిఆర్ఎస్ టికెట్ అశుచి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి (Janareddy) చేసిన సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ కు దారితీస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది కానీ సీఎం అభ్యర్థి ఎవరో మాత్రం చెప్పలేదు. దీంతో సీనియర్ నేతలంతా మీమంటే మీమే అంటూ ఎవరికీ వారు చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం నేనే అవుతానేమో అంటూ వ్యాఖ్యలు చేయగా..తాజాగా మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.

నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవట్లేదని జానారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే (CM Chance) అవకాశం హఠాత్తుగా రావొచ్చేమో అన్నారు. ఏ పదవి వచ్చినా స్వీకరిస్తానన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ సీఎం చేయనన్ని శాఖలు తాను నిర్వర్తించానని అన్నారు. తాను 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చానని, 36 ఏళ్లకే మంత్రిని అయ్యానన్నారు. తనకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టే ఎక్కువ మంది పార్టీలోకి వస్తున్నారని ఆయన అంచనా వేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) మూటలు, మాటల గారడితో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు మాయం అవుతుందన్నట్లు సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

“కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు (Congress 6 Schemes in Telangana) సాధ్యం కాదన్న కేసీఆర్… ఆ హామీలను కాపీ కొట్టి మేనిఫెస్టో (BRS Manifesto)లో పెట్టారు. కేసీఆర్ మాటల గారడితో రాజకీయం చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం బీఆర్ఎస్ చేసిన అప్పులు రాష్ట్ర ప్రజలకు భారంగా మారాయి. ఎన్నికల్లో డబ్బుతో రాజకీయం చేసే సంస్కృతి బీఆర్ఎస్ తోనే మొదలైంది. పథకాలు, పాలనతో గెలవాల్సింది పోయి విచ్చలవిడిగా డబ్బు పంపిణీతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత సీఎం కేసీఆర్ లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. కాగా జానారెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు జయవీర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం రేసులో ఉన్నానని ఆయన చెప్పడం ఇప్పుడు పార్టీలోనూ, రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

Read Also : KCR Atlas Cycle Story : సిద్దిపేట సభలో కేసీఆర్ చెప్పిన సైకిల్ కథ .. మాములుగా లేదుగా

  Last Updated: 17 Oct 2023, 09:41 PM IST