Site icon HashtagU Telugu

Jakkidi Shiva Charan Reddy : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా జక్కిడి శివ చరణ్ రెడ్డి

Jakkidi Siva Charan Reddy as President of Telangana Youth Congress

Jakkidi Siva Charan Reddy as President of Telangana Youth Congress

Jakkidi Shiva Charan Reddy : ఇటీవల తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్‌ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షడు ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు ఢిల్లీలో ఉదయ్‌ భాను చిబ్‌, ఏఐసీసీ జాయింట్‌ సెక్రటరీ మరియ నేషనల్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ క్రిష్ణ అల్లవరును జక్కిడి శివ చరణ్‌ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు లేటర్‌ను అందించారు.

ఆగస్టు మరియు సెప్టెంబర్ లో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో 2 లక్షల 16 వేయిల 115 ఓట్ల మెజారిటీతో జక్కిడి శివ చరణ్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలోనే  ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించి, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఉదయ్ భాను ఛిబ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈరోజు వెలువడిన యూత్ కాంగ్రెస్ ఫలితాలలో జక్కిడి శివ చరణ్ రెడ్డి, MLC బల్మూర్ వెంకట్ గారి మీద 2,16,115 అత్యధిక ఓట్లు నమోదు చేసి చరిత్ర సృష్టించారు.

కాగా, శివ చరణ్ రెడ్డి జక్కిడి మార్చి 2, 1992న రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్ గ్రామంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి మరియు శ్రీమతి దంపతులకు జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన శివ చరణ్‌రెడ్డి హైదరాబాద్‌లో తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించారు. అతను రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివాడు. 2007లో శివ చరణ్ రెడ్డి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తర్వాత అతను తన ఇంటర్మీడియట్ విద్యను దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫిట్జీ జూనియర్ కళాశాలలో అభ్యసించాడు. 2009లో పట్టభద్రుడయ్యాడు. తన ఉన్నత విద్య కోసం, శివ చరణ్ రెడ్డి తెలంగాణలోని మాటూరి వెంకట సుబ్బా రావు (MVSR) ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. అక్కడ అతను 2014 లో B.Tech పట్టా పొందాడు. అతను US విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.

ఇక, శివ చరణ్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఆయన అకుంఠిత దీక్ష, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు నిదర్శనం. రాహుల్ గాంధీ నాయకత్వం నుండి స్పూర్తి పొంది..రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేసిన తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ప్రభావంతో శివ చరణ్ రెడ్డి అధికారికంగా 2010లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read Also: TTD : మరోసారి తెరపైకి శ్రీవారి పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వ్యవహారం