Site icon HashtagU Telugu

Hyderabad : పార్టీ లో సభ్యత్వం తీసుకుంటే..హైదరాబాద్ లో 200 గజాల స్థలం ఫ్రీ..

Jai Mahabharat Party

Jai Mahabharat Party

ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు.. రాజకీయ పార్టీలు హామీలతో ప్రజలను మభ్యపెడతారు. ఎన్నికల్లో మా పార్టీ ని గెలిపిస్తే ఇవి ఉచితంగా ఇస్తాం..అవి ఉచితంగా ఇస్తాం..బస్సు ప్రయాణం ఫ్రీ..రైలు ప్రయాణం ఫ్రీ..చదువు ఫ్రీ..గ్యాస్ ఫ్రీ..రేషన్ ఫ్రీ ఇలా ఎన్నో ఫ్రీ గా ఇస్తామంటూ ప్రకటనలు చేస్తారు. తాజాగా ఇలాగే ఓ పార్టీ రూ.10 లతో తమ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే..హైదరాబాద్ (Hyderabad) లో 200 గజాల స్థలం ఫ్రీ గా ఇస్తామంటూ ప్రకటించారు. ఇంకేముంది రూ. 10 లతో పోయేది ఏముందని ప్రజలు తండోపతండాలుగా వచ్చి రూ. 10 ఇచ్చి సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం తీసుకొని ఏడాది కావొస్తున్నా ఇంతవరకు స్థలం లేదు ..ఏమి లేకపోవడం తో ప్రజలు రోజు ఆ ఆఫీస్ కు వచ్చి పోతున్నారు. ఇలా ప్రతి రోజు వందలాది మంది రావడం తో అక్కడ ట్రాఫిక్ జాం అవుతుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడుతున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏంటి ..

గత ఏడాది జై మహాభారత్‌ పార్టీ (Jai Mahabharat Party) పేరుతో రవీంద్రభారతి పక్కనే ఓ పార్టీ కార్యాలయం వెలిసింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న భగవాన్‌ శ్రీ అనంత విష్ణు దేవ ప్రభు సామాన్యులకు గతేడాది ఓ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించాడు. మా పార్టీలో సభ్యత్వం తీసుకోండి.. 200 గజాల ప్లాటు పట్టండి.. అంటూ సామాన్యులను ఆకర్షించాడు. ఆధార్‌, రేషన్‌, ఓటర్‌ కార్డు కాపీలు తీసుకొచ్చి రూ.10 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ఒక్కొక్కరికీ రెండు వందల గజాల స్థలం ఇస్తానని నమ్మబలికాడు. స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేయడం తో ఇది నిజమే అనుకోని మహిళలు వందలాదిగా ఆ పార్టీ కార్యాలయానికి చేరుకొని, రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. ప్రతి రోజు రవీంద్రభారతి నుంచి అసెంబ్లీ, ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే రహదారులు జనంతో కిక్కిరిసిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు సదరు పార్టీ అధ్యక్షుడిపై గతేడాది జూలైలో చీటింగ్‌ కేసు సైతం నమోదు చేశారు. ఏడాది దాటినా ఇంకా ఎవరికీ సెంటు భూమి కూడా ఇవ్వకపోవడంతో ప్రజలు ..సదరు పార్టీ అధ్యక్షుడిని నిలదీసేందుకు ఇప్పుడు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పార్టీ ఆఫీస్ కు వస్తున్నారు. దీంతో మరోసారి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి తాత్కాలికంగా అక్కడున్న వారిని చెదరగొట్టారు. తమను మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. కానీ కేసు పెట్టేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు.

Read Also : India vs Canada: కెనడాకు భారత్ షాక్.. వీసాల జారీ నిలిపివేత