హైదరాబాద్ నగరంలో పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతోంది. రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేస్తున్నారు. జగ్‌నే కీ రాత్ (Jagne Ki Raat) వేడుకలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్ (Hyderabad) లోని ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు ప్రకటించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
లంగర్‌హౌస్ ఫ్లైఓవర్లు (Flyovers), పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) కూడా ఆ సమయంలో మూసేస్తున్నట్లు (Closed) ప్రకటించారు. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 90102 03626లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు.
Also Read: Samantha Reaction: శాకుంతలం ఫెయిల్యూర్ పై సమంత రియాక్షన్.. గీతోపదేశం చేస్తూ కౌంటర్!