Site icon HashtagU Telugu

JaggaReddy : సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలను జగ్గారెడ్డి తీసుకున్నారు

Jaggareddy Kcr

Jaggareddy Kcr

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన లో బిజీ గా ఉండడం తో..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఫారాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ రేపటితో (18) ముగియనుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లను ప్రకటించింది. ఈ క్రమంలో వారికి ఇచ్చిన ఫారాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకం చేశారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున జగ్గారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ పార్టీ మంగళవారం MLC అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. నామినేషన్లకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకోవాలని వారికి సమాచారం ఇచ్చింది.

ఇక ఈ నలుగురిని ఎమ్మెల్సీలుగా చేయడంతో పాటు కేబినెట్ లోకి కూడా తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కేబినెట్ లో ఇప్పటివరకు మైనార్టీలు లేరు కాబట్టి అమీర్ అలీ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన కోడ్ రావడానికి ముందే కేబినెట్ విస్తరణ చేయాలనే యోచిస్తున్నారు. వచ్చే నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ లను కేబినెట్ లోకి తీసుకోవాలని అనుకున్నారు. అయితే, వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దాంతో ఎన్నికల్లో ఓడిన వారికి కాకుండా కొత్త వారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించింది.

Read Also : Lunch Party for Bigg Boss Contestents : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి స్టార్ హీరో విందు భోజనం..!