Jagga Reddy : బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, “కేసీఆర్ కుటుంబం—కేటీఆర్, హరీష్ రావు, కవిత—రాత్రి పూట ఫోన్లకు పెళ్ళాం మొగుడు మాట్లాడుకున్నదైనా వినేందుకు బిగించి పడుకునేవారు,” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడం అనైతికమని మండిపడ్డారు.
“నా ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయం మాకు తెలిసేంది అప్పుడే. కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్పిన సంగతి,” అని తెలిపారు. “ఒక ఏడాది మినహా, మిగతా ఎనిమిదేళ్లు కేసీఆర్ ఇలాగే తన వ్యతిరేకుల ఫోన్లను వింటూ గడిపారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం,” అన్నారు.
కవితపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “మీ అన్న (కేటీఆర్) రిజెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మీకు (కవితకు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు లేదు. కేవలం కేసీఆర్ కూతురు అనే హోదాతో ఓవర్ యాక్షన్ చేయడం అవసరం లేదు,” అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా స్పందించిన జగ్గారెడ్డి, బీఆర్ఎస్ పాలనలో అప్పులు బాగా పెరిగాయని, ఇప్పుడు ఆ అప్పుల వడ్డీలనే చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. “రైతు బంధు డబ్బులు ఆర్నెల్లు ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు జమ చేసింది,” అని చెప్పారు. “హరీష్ రావు ఇప్పుడు శ్వేతపత్రం అడుగుతున్నారు.. ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారో?” అంటూ ప్రశ్నించారు.
Devadasu : ‘దేవదాసు’ విడుదలై నేటికి 72 ఏళ్లు.. అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ వీడియో