Jagga Reddy : దమ్ములేని అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది : జగ్గారెడ్డి 

Jagga Reddy : ఈ లోక్‌సభ ఎన్నికల్లో దమ్ములేని అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిందని  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Jagga Reddy

Jagga Reddy

Jagga Reddy : ఈ లోక్‌సభ ఎన్నికల్లో దమ్ములేని అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిందని  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  అన్నారు. ఫ్రస్టేషన్‌లో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎంజాయ్  చేసుకున్నారే తప్ప.. ప్రజల ఎంజాయ్ మెంట్ గురించి పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందో లేదో తెలుసుకోవాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలని జగ్గారెడ్డి చెప్పారు. ఉపాధి హామీ పథకంతో కోట్లాది మందికి తిండి పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే అడ్డమైన కండీషన్లు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సామాన్యులను ప్రధానమంత్రులుగా చేసింది.  పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ లను ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. మోడీని ప్రధానిగా చేసిన అద్వానీకి అయోధ్య రామమందిర కార్యక్రమంలో కనీసం శాలువా కూడా కప్పలేదు’’ అని జగ్గారెడ్డి(Jagga Reddy) కామెంట్ చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం దేశ ప్రజల కుటుంబం అని ఆయన తెలిపారు. ‘‘సోనియాగాంధీ 22 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రధాని కావాలనుకుంటే ఆమె రెండు సార్లు అయ్యేది.  సోనియాగాంధీ ని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదు’’ అని జగ్గారెడ్డి చెప్పారు.

Also Read : Account Balance Zero : అకౌంటులో సున్నా బ్యాలెన్స్.. లోక్‌సభ బరిలో నిరుపేద మహిళ

‘‘కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్చ ఉంది. ప్రతి పక్ష నేతలకు వాళ్ల పార్టీలలో స్వేచ్చ లేదు’’ అని జగ్గారెడ్డి కామెంట్ చేశారు. ‘‘బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్లు డమ్మీగాళ్లు. కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్. బీజేపీ ఆఫీస్‌లో ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసిచ్చిందే ఆయన చదువుతారు’’ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read : Tillu Cube : ‘టిల్లు క్యూబ్’లో హీరోయిన్‌గా ఆ తెలుగు భామ.. నిజమేనా..?

  Last Updated: 27 Apr 2024, 04:14 PM IST