Site icon HashtagU Telugu

Jaggareddy : సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగ్గారెడ్డి

Jaggareddy Brs Mla

Jaggareddy Brs Mla

గత కొద్దీ నెలలుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోకి భారీగా చేరికలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) నుండి కీలక నేతలతో పాటు కింది స్థాయి నేతలవరకు వరుసగా కాంగ్రెస్ లో చేరుతూ వస్తున్నారు. నిన్నటికి నిన్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి సైతం బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగ్గారెడ్డి మరియు కోదండ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ తరుణంలో సంగారెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలోముగ్గురు సభ్యులతో చేరికల కమిటీని సైతం ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కోదండరామిరెడ్డిలు చేరికల వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి (Jaggareddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టామని తెలిపారు.

కాంగ్రెస్ ను వీడిన వారు..ఇతర పార్టీల వారు..గతంలో తనను వ్యతిరేకించిన వారు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చని అన్నారు. అలాగే సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే (Sangareddy BRS MLA Chinta Prabhakar) కాంగ్రెస్ చేరుతానంటే.. చేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఓపెన్ గా తెలిపారు. ఇప్పటికే ఆయన చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తనతో దామోదర రాజనర్సింహ చెప్పారని… ఆయన వస్తే చేర్చుకుంటామని..అంతే కాదు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినా తనకు ఇబ్బంది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. మరి జగ్గారెడ్డి హామీ తో బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేరుతారా..? అనేది చూడాలి.

Read Also : KTR: రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ నేతలకు కేటీఆర్ ముఖ్య సూచనలు