హైదరాబాద్ కు కేటాయించిన ఐటీఐఆర్ ను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని… ఐటీఐఆర్ రద్దుతో తెలంగాణ యువకులకు 15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయాయని.. కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందునా ఐటీఐఆర్ ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను డిమాండ్ చేస్తున్నాని తెలిపారు జగ్గారెడ్డి (Jaggareddy ).
బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో హైదరాబాద్ కు కేటాయించిన ఐటీఐఆర్ ను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. ఐటీఐఆర్ రద్దుతో తెలంగాణ యువకులకు 15 లక్షల ఉద్యోగావకాశాలు రాకుండా పోయాయన్నరు. కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందునా ఐటీఐఆర్ ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను కోరుతానన్నారు. ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడిన.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాను అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేశారు.. వాస్తవం కాబట్టి మాట్లాడినా, అవగాహన లేకుండా.. అనాలోచితంగా కూడా మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. మోడీ రద్దు చేయకపోయి ఉంటే పదేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి.. ఆధారాలతోనే నేను మాట్లాడిన.. ఇప్పుడు ఆధారాలు కూడా చూపెడుతున్నాను.. రాజకీయ విమర్శ కాదు.. ప్రభుత్వం మీద విమర్శ చేయాలని చేస్తుంది కాదు అని జగ్గారెడ్డి తెలిపారు.
హైదరాబాద్ అనుకుని ఉన్న నాలుగు ఎంపీ సీట్లను బీజేపీకే ఇచ్చారు ప్రజలు.. రఘునందన్ రావు.. మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం.. రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళం అని పేర్కొన్నారు. మేము ప్రతిపక్ష పార్టీగా ఐటీఐఆర్ కావాలని అడుగుతున్నాం.. మంజూరు చేయించి మీరే క్రెడిట్ తీసుకోండి.. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు. రద్దైన ఐటీఐఆర్ మళ్ళీ తెండి అని అడుగుతా.. సెప్టెంబర్ లో ఐటీఐఆర్ అనుమతి వచ్చింది.. ఐటీ ఏర్పాటుకు 50 వేల ఎకరాల్లో పెడితే.. 60 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని అంచనా వేశారు.. కానీ, 2016 ఏప్రిల్ లో మోడీ ప్రభుత్వం ఐటీఐఆర్ పక్కన పెట్టింది.. ఇప్పటికైనా, 8 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఐటీఐఆర్ తేవాలి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Read Also : Muchkund Dubey: మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) కన్నుమూత