Site icon HashtagU Telugu

Jagga Reddy : నువ్వు ఢిల్లీ వెళ్లు..నేను మీ మామ ఇంటికి వెళ్తా – హరీష్ కు జగ్గారెడ్డి సవాల్

Jaggareddy Harish

Jaggareddy Harish

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ vs బిఆర్ఎస్ (Congress vs BRS) మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరిపై ఒకరు సవాళ్లు , ప్రతి సవాళ్లు చేసుకుంటూ రాజకీయ వేడి నడుస్తుంది. ముఖ్యంగా రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా ఫై ప్రజలు , విపక్షాలు మండిపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తున్నామని సమాధానం చెపుతుంది. అలాగే మూసి సుందరీకరణ పేరుతో ఇళ్లను కూల్చడం ఫై విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ..సర్కార్ మాత్రం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఇలాంటివి చేయాల్సి వస్తుందని తెలుపుతుంది. మరోపక్క రుణమాఫీ (Runamafi) విషయంలో కూడా కాంగ్రెస్ సర్కార్ ఫై బిఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంది. కేవలం 25 % మందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తూ వస్తుంది.

దసరాలోపు రైతులందరికీ రూ.2 లక్షల వరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయకుంటే, ఢిల్లీలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఇంటి ముందు ధర్నా చేస్తామని, వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై నిలదీస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణంలో షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.రుణమాఫీకి 31 సాకులు పెట్టి లక్షలాది రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

హరీష్ రావు వ్యాఖ్యలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాగారెడ్డి (Jaggareddy) సవాల్ విసిరారు. “హరీశ్ రావు రాహుల్‌ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటున్నాడు. ఆనాడు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్‌ కుటుంబం. ఒక్క హామీ కూడా అమలు చేయని నువ్వు.. రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా.? నువ్వు.. నీ మామ మోసాల కుటుంబం.. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్‌ ఫాం హౌస్‌ దగ్గర దీక్ష చేస్తా.. నువ్వు ఢిల్లీ పోయిన రోజే నేను మీ మామ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తా” అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Read Also : Dasara Offer : రూ.3 లకే బిర్యానీ..ఎక్కడంటే..!!