Site icon HashtagU Telugu

Jagga Reddy: సీఎం కేసీఆర్, హరీశ్ రావుకు థ్యాంక్స్ చెప్పిన ‘జగ్గారెడ్డి’

Jaggareddy

Jaggareddy

సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావులకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప్రజల తరపున సీఎంకు, వైద్యారోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం గురించి తన వద్ద సమాచారం ఉందని, నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని హరీష్ రావు ప్రారంభిస్తున్నారని చెప్పారని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, కానీ ఆ తర్వాత జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరైందని తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మూడు సంవత్సరాలు పోరాడానని, ఎట్టకేలకు మెడికల్ కాలేజీ స్థాపనకు తన పోరాటం, సీఎం తన హామీని నెర‌వేర్చారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో తాను ఈ అంశాన్ని మూడుసార్లు లేవనెత్తిన తర్వాత సీఎం సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సీఎంకు, వైద్యారోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జగ్గారెడ్డి వెల్లడించారు.

Exit mobile version