Jagga Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంభం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు జిమ్మిక్కులు చేయలేదు’’ అని జగ్గారెడ్డి అన్నారు.
‘‘రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి అని, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆర్థిక వనరుల సమీకరణ, బతుకు తెరువు కోసం సర్వే సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. పీసీసీ పదవి అడగడం నేను కొత్త కాదు. నాకు అవకాశం వచ్చిన ప్రతి సారి నేను అడుగుతాను. అని జగ్గారెడ్డి అన్నారు.
‘‘ఎస్సీ ,ఎస్టీ, బీసీ లకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకె. కానీ మా రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ పోటీ పడే లిస్ట్ లో నేను ఉంటాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు..మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రం నుండి మాదిగను రాజ్యసభ సభ్యుడి గా చేసి కేంద్ర మంత్రి గా చెయ్ అని మంద కృష్ణ ఎందుకు అడగలేదు. దామోదర రాజనర్సింహ ను మీరా కుమార్ ను అవకాశం ఇచ్చింది ఎవరు? బీజేపీ కి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారు.’’ అని జగ్గారెడ్డి అన్నారు.