Jagga Reddy Reacts On New PCC Post To Mahesh Kumar Goud : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా (Telangana PCC Chief) రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. గత ఎనిమిది నెలలుగా పీసీసీ పదవి ఎవరికీ దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం సీనియర్ నేతలు అధిష్టానం వద్ద గట్టిగానే ట్రై చేసారు. కానీ అధిష్టానం మాత్రం BC సామజిక వర్గాన్ని పెద్ద పీఠం వేస్తూ బీసీ నేతకు పదవి కట్టబెట్టింది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఫై పార్టీ నేతలు , శ్రేణులు ఇలా ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అయితె సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రియాక్షన్ (Jagga Reddy Reacts) ఎలా ఉంటుందో అని అంత ఎదురుచూస్తుండగా..తన స్పందనను తెలియజేసారు.
మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పీసీసీ ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ గొప్పతనం
సీఎం పదవి..రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చింది కాబట్టి పీసీసీ పదవి బీసీ సామజిక వర్గానికి అధిష్టానం ఇచ్చిందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ లో చాలా సంతోషంగా ఉన్న నేను….నాకు ఏ పోస్ట్ వస్తుంది అనేది నేను చర్చ చేయనని తెలిపారు. మహేష్ గౌడ్ లాంటి సామాన్యుడిని పిలిచి పిసిసి ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ గొప్పతనమని కొనియాడారు. బీజేపీలో ప్రెసిడెంట్ అవ్వాలంటే కుదరదని…ఎప్పుడు పదవి వస్తుందో..ఎప్పుడు పోతుందో బీజేపీ లో తెలియదని తెలిపారు. ప్రాంతీయ పార్టీలో వేరే వాళ్లకు అవకాశమే లేదని సెటైర్లు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవైనా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు దక్కడానికి గల కారణాలు ఏంటనే అంశంపై అంతటా చర్చ సాగుతుంది. మహేష్ ప్రధానంగా మొదటి నుండి పార్టీకి విధేయతగా ఉండడం.. విద్యార్థి రాజకీయాల నుంచే కాంగ్రెస్ తో ఉండడం వల్లే ఈరోజు ఈ పదవికి ఆయనకు దక్కినట్లు చెప్పుకుంటున్నారు.
Read Also : HYDRA Big Shock to Murali Mohan : మురళీమోహన్ కు షాక్ ఇచ్చిన హైడ్రా..