Site icon HashtagU Telugu

Jagga Reddy: కేసీఆర్ కు జగ్గారెడ్డి ప్రశంసలు!

Jagareddy

Jagareddy

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రసంశలతో కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. “సంగారెడ్డికి మెడికల్ కాలేజీ రావడం చాలా సంతోషంగా ఉంది. 2018 ఎన్నికలకు ముందు ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకున్నారని జగ్గారెడ్డి అన్నారు.

సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కావాలంటూ నాలుగేళ్ల క్రితం తాను నిరసన ప్రదర్శన చేశానని, అసెంబ్లీలో ముఖ్యమంత్రికి వినతి కూడా ఇచ్చానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని అసెంబ్లీలో కోరగా.. ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. కళాశాల రూపుదిద్దుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. ఒకటి రెండు నెలల్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా కళాశాల ప్రారంభోత్సవం జరిగేలా వైద్యారోగ్య శాఖ మంత్రి టీ. హరీశ్‌ రావు చొరవ తీసుకోవాలని సూచించారు.

Exit mobile version