Site icon HashtagU Telugu

CM Revanth : జగ్గారెడ్డి కూడా సీఎం పేరును మరచిపోతే ఎలా..?

Jagga Reddy Forgot Cm Revan

Jagga Reddy Forgot Cm Revan

ఈ మధ్య చిత్రసీమ నటులే కాదు కాంగ్రెస్ నేతలు , పలు పదవుల్లో కొనసాగుతున్న వారు సైతం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy Name) పేరును మరచిపోవడం ఆనవాయితీగా మారింది. ఆ మధ్య అల్లు అర్జున్ సీఎం పేరు మరచిపోవడం ఎంత వివాదానికి తెరతీసిందో తెలియంది కాదు. ఆ తర్వాత మరో నటుడు బాలాదిత్య కూడా సీఎం పేరును మరచిపోయాడు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సైతం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జగ్గారెడ్డి పార్టీ కార్యకలాపాలపై మాట్లాడుతూ.., సీఎం కిరణ్ కుమార్ అని పేర్కొన్నారు. ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగ్గారెడ్డి తన పొరపాటును గుర్తించి వెంటనే సారీ చెప్పి, తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే దీనిపై చాలామంది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సీఎం పేరు చెప్పడంలో తప్పు చేశారు. అది పూర్తిగా అనుకోకుండా జరిగిన పొరపాటు మాత్రమే అని కొంతమంది అంటుంటే..మరికొంతమంది జగ్గారెడ్డి ని కూడా అరెస్ట్ చేస్తారేమో అని మరికొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.