Site icon HashtagU Telugu

Jagga Reddy : కిషన్ రెడ్డి నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు.. అట్లనైన తెలుస్తుంది

Jagga Reddy

Jagga Reddy

విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణ బీజేపీ యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. ఇవాళ జగ్గారెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు.. అట్లనైన తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏమైతుంది అని తెలుసుకోలేని నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షుడి అని.. నువ్వెం కేంద్ర మంత్రివి అని ధ్వజమెత్తారు జగ్గారెడ్డి. నల్లధనం తెస్తా.. పేదల అకౌంట్ లో వేస్తా అని మోడీ చెప్పిన మాట గుర్తు లేదా అని అన్నారు జగ్గారెడ్డి. మీ పార్టీనే ఇచ్చిన హామీ అమలుచేయలేదు.. నువ్వు మమ్మల్ని ప్రశ్నించే హక్కునీకు ఎక్కడిదని, 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా అన్నావు.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పి.. మమ్మల్ని అడుగు అన్నారు జగ్గారెడ్డి.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా.. నేను..నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం అని ఆయన సవాల్‌ విసిరారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ అమలు అయ్యిందో లేదో అడుగుదాం.. నువ్వు ధైర్యం చేస్తావా, కాంగ్రెస్ మీద బురద జల్లాలి అని బీజేపీ చూస్తోందన్నారు. గుర్రం ఎక్కినోడి కథ లెక్క ఉంది కిషన్ రెడ్డి తీరు అంటూ సెటైర్లు వేశారు జగ్గారెడ్డి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.. తర్వాత నీకు సమాధానం చెప్తామన్నారు. కిషన్ రెడ్డి.. ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యాడని, బండి సంజయ్ ని కారణం లేకుండా ఎందుకు తప్పించారు చెప్పు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ని బండి సంజయ్ తిడుతున్నాడు అని.. కేసీఆర్ ప్యాకేజి లో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడన్నారు. ఇది మీ పార్టీ నేతలు అంటున్న మాట అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also : LS Elections : మహబూబ్‌నగర్‌ అభ్యర్థుల్లో ఉత్కంఠ