Site icon HashtagU Telugu

Harish Rao : ‘CM పదవి కోసం హరీష్ రావు రూ.5 వేల కోట్లు సిద్ధం చేసుకున్నాడు’ – జగ్గారెడ్డి

Harishrao Jaggareddy Black

Harishrao Jaggareddy Black

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన ఆరోపణలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఎక్కడ దాచిపెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని.. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన అందరి భాగోతం బయట పెడుతామని హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ENC హరిరామ్ దగ్గర హరీష్ రావు డబ్బులు ఉన్నాయని అన్నారు. రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక హరీష్ రావుకు సంవత్సరం దాకా మంత్రి పదవి కేసీఆర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పులన్నీ బయట పెడతాం.. ఇది ఆరంభం మాత్రమే అని వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు 5వేల కోట్లు, కవిత, సంతోష్ కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు. హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎతులు, అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని చురకలు అంటించారు. హరీష్ రావు నిజంగా పాపాల భైరవుడే అని పేర్కొన్నారు. హరీష్ రావు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. రేవంత్, ఉత్తమ్ రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు పెట్టడంతో మేడారంలో భక్తుల సంఖ్య పెరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కేసీఆర్ అనుభవించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ప్రజలే అనుభవిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై ఐటీ, ఈడీ దాడులు జరగవు.. కిషన్ రెడ్డిని రండ కేంద్రమంత్రి అంటే సైలెంట్ ఉన్నాడని … కిషన్ రెడ్డికి పౌరుషం లేదు.. రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంది కాబట్టి పిసికేస్తుండు అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఫిక్స్