Congress Crisis: రేవంత్ రెడ్డి Vs జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో అభిప్రాయబేధాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ జగ్గారెడ్డి మధ్య మెదలైన కోల్డ్ వార్ ఓపెన్ వార్ గా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తప్పుపట్టారు.

  • Written By:
  • Publish Date - January 2, 2022 / 06:05 PM IST

తెలంగాణ కాంగ్రెస్ లో అభిప్రాయబేధాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ జగ్గారెడ్డి మధ్య మెదలైన కోల్డ్ వార్ ఓపెన్ వార్ గా మారింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై రేవంత్ గతంలో చేసిన కామెంట్స్‌ వీడియోను క్రమశిక్షణ కమిటీ బాధ్యులు చిన్నారెడ్డికి పంపారు. పార్టీ సీనియర్ నేతపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రేవంత్‌పై తానే ఫిర్యాదు చేస్తున్నానని, రేవంత్ షోకాజ్ నోటీసులివ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. శశిథరూర్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తప్పుకాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

పార్టీలో రేవంత్ ఒంటెద్దు పోకడపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు క్రమశిక్షణ కమిటీకి కనపడటం లేదా అని ఆయన ప్రశ్నించారు.

రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ హాజరైతేనే, తాను కమిటీ ముందు హాజరవుతానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.
సోనియా గాంధీకి తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్‌ అయ్యిందో తెలియదని, ee విషయంపై మీడియా ద్వారా వివరణ ఇచ్చినట్టు జగ్గారెడ్డి తెలిపారు. తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా? లేక మీడియాలో వచ్చిన వార్తలను కమిటీ సుమోటోగా తీసుకున్నదా? అన్న విషయాన్ని చిన్నారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించి పార్టీ లైన్‌ దాటిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాడా? అని,
తన సొంత ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తనకు చెప్పకుండా కార్యక్రమం ప్రకటిస్తే అది క్రమశిక్షణ కిందకు రాదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.