మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను పరామర్శించబోతున్నారు ఏపీ సీఎం జగన్ (CM Jagan). కొద్దీ రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారీ కిందపడడంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక గాయం కావడం తో దానికి సర్జరీ చేసారు. వారం పాటు యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్..ప్రస్తుతం నందినగర్ లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కు ప్రమాదం జరిగిందని తెలిసి పెద్ద ఎత్తున రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించి , ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సీఎం జగన్ సైతం కేటీఆర్ కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యం ఆరా తీయడం జరిగింది. ఇక ఇప్పుడు నేరుగా కేసీఆర్ ను కలిసి ఆరోగ్య వివరాలతో పాటు రాజకీయ అంశాలు ప్రస్తావించబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రేపు కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ లంచ్ మీటింగ్ కు హాజరవుతున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తరువాత తొలి సారి జగన్ కలవనున్నారు. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తో సత్సంబంధాలు కొనసాగించారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక, ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ సమయంలో కేసీఆర్ తో జగన్ భేటీ కావడం సర్వత్రా చర్చగా మారింది.
Read Also : House : కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నారా..? అయితే ఈ 9 రకాల విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి..