Jagan-KCR : తెలుగు రాజ‌కీయ సోద‌ర చ‌ద‌రంగం! పొంగులేటి,జ‌గ‌న్ భేటీ సీక్రెట్ ..!

పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ప్ర‌స్తుతం(Jagan-KCR) టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.

  • Written By:
  • Updated On - February 11, 2023 / 02:28 PM IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ప్ర‌స్తుతం(Jagan-KCR) టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఏ రోజైనా పార్టీకి గుడ్ బై చెప్ప‌డం ఖాయం. ఆ విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌ల ప‌లుమార్లు చెప్పారు. ఆయ‌న వెళ్ల‌బోయే పార్టీ మీద ప‌లు ర‌కాలుగా చ‌ర్చ జ‌రిగింది. అయితే, త‌ర‌చూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ఆయ‌న భేటీ(Political Chess) కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లోని ప్ర‌ధాన చ‌ర్చ‌. కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ముందుగా ఆయ‌నెందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లుస్తున్నారు? అనే ప్ర‌శ్న వేసుకుంటే వ‌చ్చే స‌మాధానాలు బోలెడు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి భేటీ (Jagan-KCR)

తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan-KCR) రాజ‌కీయాలు స‌మాంత‌రంగా ఉంటున్నాయి. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో వెళుతున్నాయి. ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వ‌డం, పరోక్షంగా తెలంగాణ‌లో వైసీపీ ప‌నిచేయ‌డం చూడ‌బోతున్నామ‌నే భావ‌న క‌లిగేలా పొంగులేటి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ(Political Chess) ఉంది. కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉన్న చోట `రెడ్డి` ఓట్ల‌ను చీల్చ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కేసీఆర్ ప్ర‌యోగిస్తున్నార‌ని టాక్‌. ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టే యోచ‌న‌లో పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి ఉన్నారు. తొలుత ఆయ‌న బీజేపీలోకి వెళ్లాల‌ని భావించారు. ఆ మేర‌కు ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. క‌మ‌లం గూటికి చేరే ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకుని అక‌స్మాత్తుగా ఆగిపోయారు. ఆ త‌రువాత విజ‌య‌మ్మ‌ను హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లో క‌లిశారు. ఇంకేముంది వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలోకి పొంగులేటి వెళుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ , వైఎస్సార్ తెలంగాణ పార్టీ మ‌ధ్య న‌డుస్తోన్న గేమ్ (Political Chess)

సీన్ క‌ట్ చేస్తే, నాలుగు రోజుల క్రితం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో క‌లిసి ఫోటోలు(Political Chess) బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇదంతా గ‌మ‌నిస్తే బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ , వైఎస్సార్ తెలంగాణ పార్టీ మ‌ధ్య న‌డుస్తోన్న గేమ్ గా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే, బీజేపీ బ‌ల‌హీనంగా ఉన్న చోట పోటీ చేయ‌డానికి క‌ర్ణాట‌క వైపు బీఆర్ఎస్ పార్టీ వెళుతోంది. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హాయం చేయ‌డానికి ప‌రోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ ఏపీ చీఫ్ గా తోట చంద్ర‌శేఖ‌ర్ ను నియ‌మించ‌డం వ్యూహంలో భాగం. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న్ను నియ‌మించ‌డం కార‌ణంగా జ‌న‌సేన ఓటు బ్యాంకు చీలిపోనుంది. ఫ‌లితంగా వైసీపీకి ప‌రోక్షంగా మేలు జ‌రుగుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

Also Read : KCR-KTR : తండ్రి జాతీయవాదం,త‌న‌యుడి ప్రాంతీయ‌వాదం,`క‌ల్వ‌కుంట్ల` మాయ‌

తెలంగాణ వ్యాప్తంగా కొత్త పార్టీని పెట్ట‌డం ద్వారా పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి(Jagan-KCR) కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను పెట్ట‌డం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ప‌రోక్ష లాభం జ‌రుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును భారీగా చీల్చ‌డం ద్వారా ఆ పార్టీని మ‌రింత బ‌ల‌హీన ప‌ర‌చేలా వ్యూహాన్ని ర‌చిస్తున్నార‌ని వినికిడి. ఇప్ప‌టికే వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించిన ష‌ర్మిల పాలేరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. అక్క‌డ నుంచి బ‌లంగా ప‌నిచేయాల‌ని నిర్ణయించుకున్నారు. ఫ‌లితంగా బీఆర్ఎస్ పార్టీ ఖ‌మ్మంలో గెలిచే అవ‌కాశాలు మెరుగుప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికైతే, బీఆర్ఎస్ పార్టీకి ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి స్థానం రాజ‌కీయంగా లేదు. ఇత‌ర పార్టీల నుంచి వెళ్లిన లీడ‌ర్ల మిన‌హా బీఆర్ఎస్ కు ఖ‌మ్మం వేదిక‌గా బ‌లం లేదు. ఇప్పుడు ఒక వైపు ష‌ర్మిల ఇంకో వైపు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కొత్త పార్టీ ద్వారా రంగంలోకి దిగితే, ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ కు ప‌ట్టుదొరుకుతుంది. ఖ‌మ్మం త‌ర‌హాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ అవ‌స‌ర‌మో అక్క‌డ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Political Chess) స‌హాయ‌స‌హ‌కారాలు ప‌రోక్షంగా బీఆర్ఎస్ తీసుకుంటుంద‌న్న సంకేతాలు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ జ‌రిగితే ఇద్ద‌రు సీఎంలకు 

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఒకేసారి జ‌రిగితే ఇద్ద‌రు సీఎంలకు(Jagan-KCR) మేలు జ‌రుగుతుంద‌ని రాజ‌కీయంగా అంచ‌నా వేసే వాళ్లు ఎక్కువ‌గా ఉన్నారు. ఎందుకంటే, సెటిల‌ర్ల ఓట్లు ఈసారి ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి కీల‌కం. వాళ్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు. అదే టైమ్ లో వైసీపీకి వ్య‌తిరేకంగా ఉన్నారు. అందుకే, ఒకేసారి ఎన్నిక‌ల‌కు జ‌రిగితే, ఇద్ద‌రికీ మేల‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. అంతేకాదు, ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ఎంఐఎం వెళ్ల‌డానికి అవ‌కాశం ఉంటుంది. రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఈసారి తెర వెనుక గేమ్ ప్లాన్(Jagan-KCR) కీల‌కం కానుంది. ఎందుకంటే, రెండు ప్ర‌భుత్వాల మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఆ వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించాలంటే తెర వెనుక ట్రాట‌జీలు అవ‌స‌రం. అందుకే, క‌ర్ణాట‌క నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎవ‌రూ ఊహించ‌నంత‌గా మాస్ట‌ర్ స్కెచ్ (Political Chess)వేస్తున్నార‌ని రాజ‌కీయాల‌ను సునిశితంగా ప‌రిశీలించే వాళ్లు భావిస్తున్నారు. అందుకే, ఇటీవ‌ల పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ జ‌రిగింద‌ని తాడేప‌ల్లి, ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Jagan-KCR : మోసం గురూ..! అన్న‌ద‌మ్ముల రాజ‌కీయ చ‌తుర‌త‌!!