Jagan-KCR : `తెలుగు బ్ర‌ద‌ర్స్ `కు విభిన్నంగా క‌నిపిస్తోన్న‌ కేంద్ర బ‌డ్జెట్

కేంద్ర బ‌డ్జెట్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి (Jagan-KCR)న‌చ్చింది.

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 04:32 PM IST

కేంద్ర బ‌డ్జెట్ ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి (Jagan-KCR)న‌చ్చింది. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వంలోని క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఏమాత్రం రుచించ‌లేదు. తెలంగాణ ఉద్యోగుల‌కు మెరుగైన జీతాలు అందుకుంటోన్న క్ర‌మంలో 10ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ మిన‌హాయింపు ఉంటే బాగుండేద‌ని ఆమె భావించ‌డం విచిత్రం. కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి ఈ బ‌డ్జెట్ (Budget) ఒక నిద‌ర్శ‌న‌మ‌ని క‌విత అన్నారు. కొన్ని రాష్ట్రాల‌కు పరిమిత‌మై బ‌డ్జెట్ గా అభివ‌ర్ణిస్తూ రాజ‌కీయ కోణం నుంచి 2023-24 ఆర్థిక బ‌డ్జెట్ అంచ‌నాల‌ను చూశారు. ఇక బుగ్గ‌న మాత్రం కేంద్ర బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అధికార ప‌క్షాల‌కు మాత్రం విభిన్నంగా కేంద్ర బ‌డ్జెట్ (Jagan-Budget)

ఆదాయ పన్ను రేట్లు, శ్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని సంతోషం వ్య‌క్తం చేశారు. అంటే, క‌విత చెప్పిన దాని ప్ర‌కారం మెరుగైన జీతాలు ఏపీలో లేవ‌ని అనుకోవ‌డానికి (Jagan-KCR)ఆస్కారం ఉంది. గతేడాది బడ్జెట్ మూల ధన వ్యయం రూ.7.28 లక్షలు ఉండగా, ఈసారి రూ.10 లక్షలకు పెరిగినట్టు బడ్జెట్(Budget) లో చెప్పారు. అలాగే, గతేడాది 6.4 శాతం ద్రవ్యలోటు ఉండగా, ఇప్పుడది 5.9 శాతానికి తగ్గినట్టు చూప‌డాన్ని శుభపరిణామంగా ఆయ‌న భావించారు. యూరియా సబ్సిడీ, వ్యవసాయపరమైన సబ్సిడీలు తగ్గినట్టు కనిపిస్తున్నాయని బుగ్గన అన్నారు. గతేడాది యూరియా సబ్సిడీ రూ.1.54 లక్షల కోట్లు ఉండగా, ఈసారి ఆ సబ్సిడీ రూ.1.31 లక్షల కోట్లు కేటాయించినట్టు చూప‌డాన్ని ఎత్తిచూపారు.

Also Read : Kavitha React on Budget: మోడీ బడ్జెట్ అంకెల గారడి: కల్వకుంట్ల కవిత

రైల్వేకు బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని, గతేడాది రూ.1.89 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించార‌ని కొనియాడారు. వ్యవసాయం, పౌరసరఫరాలకు కేటాయింపులు తగ్గినట్టు భావించారు. రోడ్లు, రైల్వేల మౌలిక వసతుల కోసం భారీగా కేటాయించినట్టు అర్థమవుతోందని బుగ్గన వెల్లడించారు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ఓ థీమ్ ప్రకారం రూపొందిస్తున్నాన్న బ‌డ్జెట్ ఈసారి 7 ప్రధాన అంశాలను ప్రాతిపదికగా చేసుకుని బడ్జెట్ రూపకల్పన చేయ‌డాన్ని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ వాటా రూ.41,338 కోట్లు,  తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు  అని బడ్జెట్ లో….

దేశంలోని ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు ప్రకటించగా, బీబీ నగర్, మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రులు కూడా నిధులు అందుకోనున్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం సహా అన్ని మ్యూజియంలకు రూ.357 కోట్లు కేటాయించారు. మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు కేటాయించారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.683 కోట్లు కేటాయించారు. ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Also Read : Union Budget : `మోడీ` మేడిపండు బ‌డ్జెట్‌, రూ. 45ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ లో రైతే లాస్ట్‌

సింగరేణికి కేంద్ర బడ్జెట్ లో రూ.1,650 కోట్లు కేటాయించారు. ఐఐటీ హైదరాబాద్ కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయించ‌గా, తెలుగు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు అందించనున్నారు. ఇక, కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా రూ.41,338 కోట్లు అని బడ్జెట్ లో పేర్కొన్నారు. బ‌డ్జెట్ మీద ఇంకా విప‌క్షాల లీడ‌ర్లు తెలుగు రాష్ట్రాల్లో స్పందించ‌లేదు. అధికార ప‌క్షాల‌కు మాత్రం విభిన్నంగా కేంద్ర బ‌డ్జెట్ క‌నిపిస్తోంద‌ని బ‌గ్గన‌, క‌ల్వ‌కుంట్ల క‌విత స్పంద‌న ఆధారంగా ఒక క్లారిటీ కి రావ‌చ్చు.