Jagan-BJP Game : కాంగ్రెస్ లో ష‌ర్మిల చేరిక శాశ్వ‌తంగా ఆగిన‌ట్టే.?

Jagan-BJP Game : కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల చేరిక లేన‌ట్టేనా? తాత్కాలికంగా చేరిక ఆగిందా? ఆమెను కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టిందా?

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 04:08 PM IST

Jagan-BJP Game : కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల చేరిక లేన‌ట్టేనా? తాత్కాలికంగా చేరిక ఆగిందా? లేక ప‌ర్మినెంట్ గా ఆమెను కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టిందా? అస‌లు ఏమి జ‌రిగింది? అనే దానిపై విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ష‌ర్మిల ఈనెల 16వ తేదీన సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఆ మేర‌కు ముహూర్తం కూడా పెట్టుకున్నార‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లోకి టాక్‌. ఆ రోజు సోనియా, రాహుల్, ప్రియాంక త‌దిత‌ర అగ్ర‌నేత‌లు హైద‌రాబాద్ వ‌చ్చారు. వాళ్ల స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంకేముంది, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీలో అవుతుంద‌ని అందరూ భావించారు. కానీ, సీన్ మారింది. ఎక్క‌డ బ‌ట‌న్ నొక్కారు? ఎవ‌రు నొక్కారు? అనేది మాత్రం సందిగ్ధం.

కాంగ్రెస్ పార్టీలో ష‌ర్మిల చేరిక లేన‌ట్టేనా? (Jagan-BJP Game)

కొన్ని న్యూస్ ఛాన‌ళ్ల‌లో జ‌రిగిన ప్ర‌చారం మేర‌కు ఈనెల 16వ తేదీన సాయంత్రం ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆ రోజు ఉద‌యం బ్ర‌ద‌ర్ అనిల్ , ష‌ర్మిల ఒక వేడుక‌కు వెళ్లారు. హ‌ఠాత్తుగా విజ‌య‌మ్మ నుంచి ష‌ర్మిల‌కు కాల్ వ‌చ్చింద‌ట‌. వెంట‌నే బ‌య‌లుదేరి ఇంటికి రావాల‌ని ఆ ఫోన్ కాల్ సందేశ‌మ‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాల ద్వారా అందుతోన్న స‌మాచారం. ఏమైయిందోన‌ని, వేడుక మ‌ధ్య‌లోనే బ్ర‌దర్ అనిల్, ష‌ర్మిల ఇంటికి చేరుకున్నారు. `జ‌గ‌న‌న్న ఆస్తులు పంచి ఇస్తాన‌ని ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరొద్ద‌ని చెప్పాడు. బైబిల్ మీద ఒట్టు వేసి చెప్పాడు.` అంటూ ష‌ర్మిల‌కు విజ‌య‌మ్మ చెప్పార‌ట‌. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక  (Jagan, BJP Game) వాయిదా ప‌డింద‌ని కొన్ని న్యూస్ ఛాన‌ళ్ల‌లో ఆ రోజు జ‌రిగిన ప్ర‌చారం. సీన్ క‌ట్ చేస్తే, ఆమె కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుతానికి దూరంగా ఉన్నారు.

బైబిల్ మీద ఒట్టు వేసి

ఆస్తుల పంప‌కం కార‌ణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల మ‌ధ్య వివాదం నెల‌కొంద‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అందుకే, ఆమె రాజ‌కీయంగా తెలంగాణ రాష్ట్రాన్ని వేదిక‌గా చేసుకున్నారు. ఏపీలో అన్న మీద నేరుగా పోరాడేందుకు సిద్దంగాలేని ఆమె తెలంగాణ‌లో పార్టీ పెట్టార‌ని తొలి రోజుల్లో వినిపించిన వాద‌న‌. కానీ, చాలా దూర దృష్టితో అన్నా, చెల్లెలు ఆడిన రాజ‌కీయ గేమ్ గా ఇప్పుడు కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. తొలి రోజుల్లో ఆమె పార్టీ పెట్ట‌డం వెనుక బీజేపీ ఉంద‌ని కొంద‌రు, అధికారంలోని బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌మేయం ఉంద‌ని మ‌రికొంద‌రు భావించారు. అందుకు త‌గిన విధంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేత‌లు ఆమె మీద ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు చేయ‌లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడ‌ర్ రేవంత్ రెడ్డి మాత్రం(Jagan-BJP Game) ష‌ర్మిల గురించి విమర్శిస్తూ వ‌చ్చారు.

తెలంగాణ మీద  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దీర్ఘ‌కాలిక ప్లాన్ 

తెలంగాణ మీద ప‌ట్టు సాధించ‌డానికి మార్గాన్ని సుగ‌మ‌మం చేసుకునే క్ర‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆడిన నాట‌కంగా కొంద‌రు చెబుతున్నారు. ప్ర‌త్యేకించి `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం ప్రాబల్యం ఎక్కువ‌గా తెలంగాణ మీద ఉంది. కేవ‌లం 0.5శాతం ఉన్న వెల‌మ సామాజిక‌వ‌ర్గం ప్ర‌స్తుతం పెత్త‌నం చేస్తోంది. దాన్ని `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం లాగేసుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. ఏపీలోనూ అలాంటి ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయింది. ఇప్పుడు తెలంగాణ మీద ప‌ట్టు ఎలా సాధించాలి? అనే అంశంపై దీర్ఘ‌కాలిక ప్లాన్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసిన‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఆస్తుల‌న్నీ హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలంటే, తెలంగాణ మీద ప‌ట్టు సాధించాలి. ప్ర‌స్తుతం కేసీఆర్ ఒక అన్న‌లా ఆద‌రిస్తున్న‌ప్ప‌టికీ ఇత‌రుల మీద ఆధార‌ప‌డే మ‌న‌స్త‌త్వం (Jagan-BJP Game) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిది కాదు.

Also Read : Khammam Politics: పాలేరు సీటు యమ హాట్, తుమ్మలకు టికెట్ దక్కేనా!

ప్ర‌స్తుతం బీజేపీ అడుగు జాడ‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌డుస్తున్నారు. ఏపీలో కింగ్, తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్ కావాల‌ని క‌మ‌ల‌నాథుల టార్గెట్. అందుకోసం ఏపీ సీఎంను పావుగా వాడుకుంటోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీలోకి ష‌ర్మిల‌ను వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌ని తెలుస్తోంది. ఒక వేళ ష‌ర్మిల కాంగ్రెస్ లోకి వెళితే, ఆ పార్టీ బ‌ల‌ప‌డుతుంది. అది, ఏ మాత్రం బీజేపీకి ఇష్టంలేదు. రాబోవు రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న త‌రుణంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ‌ను తీసుకుంటోంది. క‌ర్ణాట‌క‌లోనూ ఆయ‌న మ‌ద్ధ‌తును తీసుకుంటూ రాజ‌కీయాల‌ను న‌డుపుతోంది. తాజాగా త‌మిళ‌నాడులోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ‌తో బీజేపీ పాగా వేయాల‌ని భావిస్తోంది. అంత‌టి బ‌ల‌మైన బంధాన్ని బీజేపీతో కొన‌సాగిస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద్వారా ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేర‌డాన్ని ఆపేశార‌ని తెలుస్తోంది. సో, శాశ్వ‌తంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరే ప్ర‌క్రియ ఆగింద‌ని టాక్. ఇలాంటి ప‌రిస్థితుల్లో డీకే శివ‌కుమార్ ఏమి చేస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

Also Read : TDP MLA’s : వైసీపీ పుట్టింది ములాఖత్ లు.. మిలాఖత్‌ల నుంచే : టీడీపీ ఎమ్మెల్యేలు